కర్నూలు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని వైయస్‌ఆర్‌సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. చంద్రబాబు అవినీతిపాలనలో ప్రజలు విసిగిపోయారని దుయ్యబట్టారు.