ప్రజల కోరిక నేరవేరింది

ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు

శ్రీకాకుళం: పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆసుపత్రికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయడంతో ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అన్నారు. శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వం యువకులను మోసం చేసిందని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు.   రూ.600 కోట్లతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయడం హర్షనీయమన్నారు. ఉద్దానం పునర్మిణానికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి అభినందనీయమన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top