ప్రజలు బుద్ధి చెప్పినా అయ్యన్నకు సిగ్గు రాలేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

తిరుపతి: ప్రజలు బుద్ధి చేప్పినా టీడీపీ నేత ఆయ్యన్న పాత్రుడికి సిగ్గురాలేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై అయ్య‌న్న‌పాత్రుడి అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఆమె తీవ్రంగా ఖండించారు. నగరి వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. తర్వాత ఆలయం ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..  అయ్యన్న పాత్రుడి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచారని ఆమె గుర్తుచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top