ఆర్టీసీ సమస్యలను వైయస్‌ జగన్‌ పరిష్కరిస్తారు

ఇచ్చిన మాట  సీఎం వైయస్‌ జగన్‌ తప్పరు..

ఫస్ట్‌ కేబినెట్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశం

కొన్ని యూనియన్లు క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి

విజయవాడ: ఆర్టీసీ పరిరక్షణకు,కార్మికుల సంక్షేమానికి  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ రక్షించిన మహానేతగా వైయస్‌ఆర్‌ నిలిచారని గుర్తుచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎప్పటినుంచో ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారని..వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా మొదటి కేబినెట్‌లోనే నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా ఆర్టీసీ సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తారన్నారు. కార్మికులను మభ్యపెట్టి క్యాష్‌ చేసుకోవడానికి కొన్ని యూనియన్లు బంద్‌ నోటీసులు ఇవ్వడం ఏ కార్మికుడు హర్షించరని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తారని తెలిపారు.అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి  కొంత  సమయం ఇవ్వాలని  కోరారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశం ఫస్ట్‌ కేబినెట్‌లో ముందుకు వస్తోందని.. కొన్ని యూనియన్లు క్యాష్‌ చేసుకునేందుకు యత్నిస్తున్నాయన్నారు.వైయస్‌ఆర్‌పై అభిమానం,వైయస్‌ జగన్‌పై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని తెలిపారు.మాట ఇస్తే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నటికీ తప్పరన్నారు.వైయస్‌ఆర్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ తరపున కార్మికుల మెంబర్‌ షిప్‌ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ప్రతి కార్మికుడికి వైయస్‌ఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Back to Top