సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైయస్‌ జగన్‌కున్న ప్రజాబలం ముందు ఏ పార్టీ నిలవలేదన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. 2014లో భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న టీడీపీ–బీజేపీ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయన్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణితో ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాలకు అండ‌గా నిలుస్తున్నార‌ని, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నార‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌తి కుటుంబంలో వెలుగులు నింపార‌న్నారు.

Back to Top