కర్నూలు: రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి యాగంటి క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కొనసాగుతోంది. 7 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే పాదయాత్ర చేయనున్నారు. యాగంటి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన రాంభూపాల్‌రెడ్డి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టగా, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతు సంఘీభావం తెలిపారు. పాణ్యంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కాటసాని నివాళులర్పించారు. Read Also: బీసీలకు వైయస్ జగన్ అందలం