అసెంబ్లీ: చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్ స్కామ్ జరిగిందనేది వాస్తవమని ఆధారాలన్నీ రుజువు చేస్తున్నాయని, డేట్ లేని ఫేక్ ఎంవోయూ, ఫైల్‌పై 13 సంతకాలు పెట్టాడని, సంతకాలు పెట్టిన బాబుకు స్కిల్ స్కామ్‌తో సంబంధం లేదంటే ఎలా అని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఎంవోయూపై డేట్ ఎందుకు లేదంటే కరెంట్ పోయిందని చెబుతున్నారని, చీకటి ఒప్పందం ద్వారానే స్కిల్ స్కామ్ జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఫైనాన్స్ అధికారులు వారిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆగమేఘాల మీద రూ.371 కోట్ల రిలీజ్ చేయించిన చంద్రబాబు.. సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం వాటాలోని ఒక్క రూపాయిని కూడా ఎందుకు రాబట్టలేకపోయారని ప్రశ్నించారు. పథకం ప్రకారం ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి షెల్ కంపెనీలను సృష్టించి.. వాటి ద్వారా డబ్బులు మళ్లించుకున్నారని చెప్పారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌కు ఎవరు టికెట్లు తీసి అమెరికాకు పంపించారో పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో జరిగిన చర్చలో ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీలో కురసాల కన్నబాబు ఏం మాట్లాడారంటే.. చంద్రబాబు నాయుడు నేర్పరి తనం, ఆయన స్కిల్ 45 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో దోపిడీకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది వివరిస్తాను. దొరికిన దొంగ ఒక మహా పునీతుడికిలా, గొప్ప మహా నాయకుడిలా, అన్న హజారేకి అన్నలా ప్రచారం చేసుకుంటుంటే నిజాలేవో, అబద్ధాలేవో తెలియని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రజానీకాన్ని ముంచేయాలని చంద్రబాబు అనుకూల మీడియా, ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తుంటే.. వాస్తవాలను అసెంబ్లీ వేదికగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రావడం రావడమే చాలా దారులు వేసుకున్నాడు. ఏ విధంగా ప్రజల సొమ్మును కాజేయొచ్చు.. ఏ విధంగా తాబేదారులకు దోచిపెట్టొచ్చు అనే విషయంపై చాలా క్లారిటీతో ముందుకెళ్లినట్టు స్కిల్ కేసును పరిశీలిస్తే అర్థం అవుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత మొదట సీమెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను తీసుకొని, ఆ ప్రోగ్రాంలో డిజైన్ టెక్ అనే సంస్థను కూడా ఇన్వాల్వ్ చేశామని, వీరంతా కలిసి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇల్లెందుల రమేష్ 2014 జూలైలో చంద్రబాబును కలిశాడు. అతన్ని బాబుకు అత్యంత సన్నిహితుడు గంటా సుబ్బారావు దగ్గరకు పంపించి ఆయన్ను సీఎంవోకు పిలిపించుకొని అక్కడి నుంచి యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 2014 ఆగస్టు5న స్టార్ట్ చేసి 22వ తేదీలోపు అంటే దాదాపు 15 రోజుల్లోపు ఈ కార్యక్రమానికి యుద్ధ ప్రాతిపదికన రూపకల్పన చేశారు. 90 శాతం సీమెన్స్ అనే సంస్థ పెట్టుబడి పెడుతుందని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఒప్పందం. 100 శాతంతో టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అందిస్తామని చెప్పారు. చెప్పిన 15 రోజుల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన ఒక శాఖను చంద్రబాబు ప్రారంభించారు. అత్యంత సన్నిహితులుగా ఉన్న గంటా సుబ్బారావును, బాబు చిన్ననాటి స్నేహితుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణను స్కిల్ డెవలప్‌మెంట్‌లో నియమించారు. ఇది జరిగిన నెలరోజుల్లోపు గంటా సుబ్బారావును ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా కూడా నియమించుకున్నాడు. ప్రపంచానికి ఏమీ తేలియదని, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొందరు ప్రవర్తిస్తుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు జే.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ఆడిటర్‌గా నియమించారు. టీడీపీ ఆడిటర్‌ను తీసుకువచ్చి స్కిల్ డెవలప్‌మెంట్ ఆడిటర్‌గా నియమించారు. ఇవన్నీ రెండు నెలల్లోపు జరిగిపోయాయి. గుజరాత్‌లో టేకప్ చేసిన ప్రాజెక్టును ఏపీలో చేస్తున్నామని చెప్పి నమ్మించారు. ఆరు క్లస్టర్స్‌ను స్టార్ట్ చేస్తాం. వీటికి గానూ రూ.3,281 కోట్లు ఖర్చు అవుతుంది. దాంట్లో 90 శాతం సీమెన్స్ పెట్టుబడి పెడుతుందని, ట్యాక్స్‌తో కలిపి రూ.371 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన జీవోలు విడుదల చేశారు. ముందు హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌లో పెట్టారు.. ఆ తరువాత అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న డిపార్టుమెంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. తరువాత ఆగమేఘాల మీద పనిచేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి 2015 జూన్‌లో ఒక ఎంవోయూను చేసుకున్నారు. ఆ ఒప్పందం ఒక మోసం. ఒప్పందాలపై ఎండీ, సీఈవో హోదాలో గంటా సుబ్బారావు, డిజైన్ టెక్, సీమెన్స్ తరఫున సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే వ్యక్తి, డిజైన్ టెక్‌కు సంబంధించిన వికాస్ ఖన్వేల్కర్ అనే వ్యక్తి ముగ్గురూ కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు. తరువాత అపర్ణ అనే ఐఏఎస్ అధికారిని సీమెన్స్‌లో సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న భాస్కర్ భార్యను డిప్యుటేషన్ మీద తీసుకువచ్చి డిప్యూటీ సీఈవోగా నియమించారు. సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్‌తో పాటు ముకుల్ అగర్వాల్ అనే మూడో వ్యక్తి ఉన్నాడు. పీవీఎస్‌పీ ఐటీ స్కిల్ అండ్ స్కిల్లర్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ముకుల్ అగర్వాల్ ఎండీ. వీరు ముగ్గురు అంతకుముందు డిలైట్ కంపెనీలో పనిచేసిన మిత్రబృందం. స్కిల్లర్ షెల్ కంపెనీ. అప్పటికప్పుడు సృష్టించిన డొల్ల కంపెనీ. ఆ కొత్త కంపెనీ స్కిల్ డెవలప్‌మెంట్‌లోకి తీసుకువచ్చారు. అధికారులతో మానిటరింగ్ కమిటీ నియమించి గుజరాత్ వెళ్లి చూసి వచ్చామని చెప్పారు. బడ్జెట్ రిలీజ్‌కు సంబంధించి పరుగులు ప్రారంభమయ్యాయి. 2015 అక్టోబర్‌లో బడ్జెట్ రిలీజ్ ప్రారంభించి.. ఆగమేఘాల మీద ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లోని అధికారులు ఇది అత్యంత అవసరం కాదు.. దీనికంటే అవసరమైనవి చాలా ఉన్నాయి.. కాబట్టి ఒకసారి దీన్ని సరిచూసుకోండి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆగమేఘాల మీద డబ్బులు రిలీజ్ చేసే కార్యక్రమం చేశారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చిలోపు మొత్తం రూ.371 కోట్లను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన అమౌంట్ ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి జమ చేయకుండా కొత్తగా ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు డైరెక్ట్‌గా నిధులు మళ్లించారు. ఒక కంపెనీకి మాత్రమే మొత్తం డబ్బులన్నీ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటే దొరికిపోతామని నంబర్ ఆఫ్ కంపెనీస్‌ను రిజిస్టర్ చేయడం మొదలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.371.25 కోట్లు డిజైన్ టెక్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడి నుంచి సెకండ్ లేయర్‌గా షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అలా ట్రాన్స్‌ఫర్ చేసే క్రమంలో పీవీఎస్‌పీ అనే షెల్ కంపెనీకి నేరుగా రూ.241 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒప్పందం సీమెన్స్‌తో.. డబ్బులు మాత్రం కొత్తగా ముకుల్ అగర్వాల్‌తో ఏర్పాటు చేయించిన కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. తరువాత అక్కడి నుంచి డబ్బు డ్రా చేయడం కోసం దాదాపు 12 డొల్ల కంపెనీలను రిజిస్టర్ చేశారు. ఏసీఐ, కెడెన్స్, పొలరీస్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ప్యాట్రిక్, ఐటీస్మిల్, భారతీయ గ్లోబల్, ఫారిన్ కంప్యూటర్స్ ఇలా కంపెనీలకు డబ్బు జమ చేసుకుంటూ వచ్చారు. ప్లాన్ ప్రకారం డబ్బులు లూటీ చేశారు. ఏదైనా కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు 90 శాతం కంపెనీ, 10 శాతం ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు నిధులు ఎలా విడుదల చేయాలనే విధానం రూపొందించుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం కంపెనీ పెట్టుబడి పెట్టిన తరువాత గవర్నమెంట్ కొంత డబ్బు రిలీజ్ చేస్తుంది.. ఈ మైల్డ్ స్టోన్ రీచ్ అయ్యిందా లేదా చూడటానికి చెకింగ్ మెకానిజం రూపొందిస్తామని చెప్పాలి. ఈ విధంగా సిస్టమ్ రూపొందించకుండా.. ఆగమేఘాల మీద డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ అధికారులు బయట వేర్వేరుగా మాట్లాడిన కూడా.. అప్పట్లో పీవీ రమేష్ అనే ఐఏఎస్ అధికారి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నోట్ రాశారు. ఇదే డిపార్టుమెంట్‌లో సునీత అనే ఐఏఎస్ అధికారి ఒక లేఖ రాశారు. అసలు ఈ ఫైల్‌కు ఫైనాన్స్ అప్రూవల్ లేదు, డబ్బుల మంజూరు లేదు.. ఎలా డబ్బు రిలీజ్ చేయమంటారు..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఇంత డబ్బు ఎందుకు పెట్టాలి.. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొంత మొత్తాన్ని ఖర్చు చేయండి.. దాని ఫలితాలు చూసిన తరువాత ముందుకు తీసుకువెళ్లండని చాలా క్లియర్‌గా రాశారు. డబ్బులు రిలీజ్ చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా అధికారులు ప్రతిసారి హెచ్చరించారు. బహుశా వారికి ముందే అర్థమై ఉంటుంది. ఇదొక రాజకీయ కక్షసాధింపు అని మాట్లాడుతున్నారు. కావాలనే సీఎం వైయస్ జగన్ చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారని బయట ప్రచారం చేస్తున్నారు. స్కిల్ స్కామ్‌ను 2017లో జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటకు తీసుకువచ్చింది. కొట్టేసిన డబ్బుకు సోర్స్‌లో డిడక్ట్ చేసిన ట్యాక్స్‌ను తిరిగి మాకు పే చేయండి అని ట్రై చేశారు. అప్పుడు ఈ కంపెనీలు ఏంటీ..? వీటి కథ ఏంటీ..? అని జీఎస్టీ వెతకడం మొదలుపెడితే దొరికారు. వ్యాట్ కొట్లాటలో దొరికిపోయారు. 2018 నాటికి జీఎస్టీ వారికి క్లారిటీ వచ్చింది. నిధులు మళ్లింపు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి జరిగింది.. దీన్ని మీరు చెక్ చేసుకోండి అని విజిల్ బ్లోయర్‌గా ఏపీ ప్రభుత్వానికి రెడ్ ఫ్లాగ్ చేశారు. జీఎస్టీ, ఈడీ ఏదైనా పట్టుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు రెడ్ ఫ్లాగ్ చేస్తాయి. దీనిపై యాక్షన్ తీసుకోండని చెబితే.. సెక్రటేరియట్‌లో ఉన్న నోట్ ఫైల్స్ మాయం చేశారు. సచివాలయంలో ఒక్క నోట్ ఫైల్ లేకుండా మాయం చేశారు. ఇవన్నీ షాడో ఫైల్స్. అసలు ఫైల్స్ మాయం చేసినా కూడా ఎక్కడోచోట దానికి సంబంధించిన రన్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ప్రభుత్వం క్రోడీకరించింది. చంద్రబాబునాయుడు కేబినెట్‌ను తప్పుదోవ పట్టించాడు. కేబినెట్‌లో ఆమోదించింది ఒకటి.. ఎంవోయూ చేసుకున్నది మరొకటి. ఎంవోయూల మీద సంతకాలు పెట్టిన సుమన్ బోస్ అనే వ్యక్తిని టీడీపీ వాళ్లు పట్టుకొచ్చి టీవీల్లో ఒక ఇంటర్వ్యూ ఇప్పించారు. అగ్రిమెంట్ మీద డేట్ లేదని ప్రశ్నిస్తే కరెంటు పోయిందని సమాధానం ఇస్తున్నాడు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుకు ఎంవోయూ చేసే సమయానికి కరెంట్ తీసేసి చేశారంటే.. దీని వెనకున్న లోగుట్టు అర్థం అవుతుంది. చీకటి ఒప్పందం అని చదువుతాం కానీ, ఈ అగ్రిమెంట్ చీకటి ఒప్పందానికి సరైన నిదర్శనం. అంత విజన్ ఉన్న చంద్రబాబు పాలనలో సచివాలయంలో, సీఎంవోలో కరెంట్ పోతే జనరేటర్ లేదా..? కరెంటు పోతే చీకట్లో సంతకాలు పెట్టామని చెబుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఏదైనా ఉంటుందా..? కరెంట్ పోయింది కాబట్టి డేట్ వేయలని అంటున్నారు. అగ్రిమెంట్‌లో డేట్‌లు వేయలేదు. ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేయాలనేది కూడా లేదు. ఎంవోయూ అనేది ఫేక్. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీ దర్యాప్తు సమయంలో సీఐడీ అధికారులకు అఫిషీయల్‌గా మెయిల్ చేసింది. మా కంపెనీకి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లు ఇచ్చే కథలు మా దగ్గర లేవు.. ఇది చంద్రబాబు సొంత కథ అయ్యి ఉంటుందని చెప్పింది. ఒక వ్యాపార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రూ.3 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుందనేది విజనరీ చంద్రబాబుకు తెలియలేదా..? విజనరీ చేసిన పాపానికి ప్రిజనరీగా రాజమండ్రి జైల్లో కూర్చున్నాడు. 2017 నుంచి మొదలై 2018 వరకు చాలా జరిగిపోయింది. నిజంగా కక్ష సాధించాలనే మా ప్రభుత్వానికి ఉంటే.. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో వేసేయాలి కదా.. ఒక పక్క జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్, మరోపక్క ఈడీ దర్యాప్తు జరుగుతున్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన తప్పుల మీద, ఆయన హయాంలో జరిగిన వ్యవహారాల మీద కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ మీద కూడా కోర్టుకు వెళ్లారు. అప్పట్లో చంద్రబాబుకు అప్పట్లో బ్రహ్మాండమైన బలం ఉండేది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ 2021లో ఒక పిటీషన్ ఇచ్చారు. ‘నేను కూర్చొని చూస్తే చాలా తప్పులు జరిగినట్టు కనిపిస్తోంది. కాబట్టి దర్యాప్తు చేయండి అని 2021 డిసెంబర్‌లో సీఐడీకి పిటీషన్ ఇచ్చారు. అప్పుడు సీఐడీ ఈ కేసును టేకప్ చేసింది. అప్పటి వరకు ఈ కేసును జీఎస్టీ, ఈడీ నడిపించారు.. ఇప్పటికీ ఆ కేసుపై వారు పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. 7గురు దీంట్లో ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. ఇదేదో కక్షసాధింపుగా చేసిందని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బాబు ఎవరితో సంతకాలు చేయించడో సుమన్ బోస్, వికాస్ అనే వ్యక్తులను ఈడీ చాలా క్రితమే అరెస్టు చేసింది. ఇప్పుడు బెయిల్ మీద వచ్చి చంద్రబాబుకు మద్దతుగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. సౌమ్యాద్రి శేఖర్‌బోస్ అనేది అసలు పేరు అయితే.. ఆయన చేసిన ప్రతి సంతకం సుమన్ బోస్ అని చేశాడు. అది కూడా చీకట్లో చేశారా.. కళ్లు మూసుకుపోయి ఉన్నాడా అనేది తేలాలి. ఈ స్టేట్‌మెంట్స్ అన్ని ï164 సెక్షన్ ప్రకారం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, ఐఏఎస్ అధికారి కె.సునీత వీరు కూడా వాంగ్మూలం ఇచ్చారు. వీరితో పాటు మొత్తం 17 మంది వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. ఈ అవకతవకలు ఎలా జరిగాయో ఇన్‌కం ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది. 2023 ఆగస్టు 4న నోటీస్ జారీ చేసింది. ఐఆర్‌ఎస్ అధికారి దొండపాటి వెంకట హరీష్ అనే అధికారి నోటీస్ పంపించారు. డొల్ల కంపెనీలను సృష్టించి అక్కడి నుంచి నిధులు మళ్లించడం ఎలా అనే విధానం చంద్రబాబుకు ఉందని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ చెప్పింది. అవినీతి సొమ్మును ఎలా దారి మళ్లిస్తాడో చంద్రబాబు గురించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఐటీ శాఖ చెప్పింది. రూ.167 కోట్లకు మేము గుర్తించాం.. మీరు దీనికి సమాధానం చెప్పండి అని అందులో రూ.118 కోట్లకు సంబంధించి నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అనే శిష్యుడు ఉన్నాడు. ఇతని ఇంటిపై కూడా ఐటీ శాఖ రైడ్స్ చేసింది. అతని నుంచి ల్యాప్‌టాప్‌లు ఇతరత్రా సరంజామ స్వాధీనం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. అలా యోగేష్ గుప్త అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇతను ఏ కంపెనీ పేరు మీదైనా బోగస్ ఇన్‌వాయిస్‌లను క్రియేట్ చేయగలుగుతాడు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు అతనికి ఉన్న సత్సంబంధాలతో వారికి కావాల్సిన ఇన్‌వాయిస్‌లను క్రియేట్ చేసి ఇస్తాడని పట్టుకున్నాడు. తాత్కాలిక భవనాలు, అసెంబ్లీ నిర్మాణాల్లోనూ డబ్బులు లూటీ చేశారు. అలా షాపూర్‌జీ–పల్లోంజి, ఎల్‌అండ్‌టీ నుంచి కొంత డబ్బు బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా లాగేశారని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ డబ్బు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చెప్పిన దగ్గరకు వెళ్లిందని గుర్తించారు. దీనికి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారు. రెండు టోకెన్లు హైదరాబాద్ వెళ్లాయి.. ఇన్ని టన్నులు పంపించాం.. అనే పదాలను ఉపయోగించారు. వీరితో పాటు కిలారి రాజేష్ అనే లోకేష్ స్నేహితుడు ఉన్నాడు. వీరందరికీ ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు తయారు చేసుకున్న మాఫియా సిస్టమ్ ఎలా ఉంటుందో మనకంటే ముందే ఈడీ, జీఎస్టీ వెలికి తీశాయి. దీనితో పాటు యోగేష్ గుప్త చాలా కీలకం. ఇతన్ని కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరందరికీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దొరికిన దానికి సమాధానం చెప్పండి.. విచారణ చేస్తామని ఐటీ నోటీస్ వచ్చిన నెల తరువాత 2023 సెప్టెంబర్ 5న సీఐడీ నోటీస్ ఇస్తే.. 6వ తేదీన పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయాడు. చంద్రబాబు కుమారుడు తండ్రి జైల్లో ఉంటే ఆనందపడుతున్నాడో, సంతోషిస్తున్నాడో తెలియడం లేదు. నేషనల్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఢిల్లీలో తిరుగుతున్నాడు. ఇంటర్వ్యూలో పెండ్యాల శ్రీనివాస్ గురించి అడిగారు.. అతను అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదని చెప్పాడు. పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని తెలియదా.. లేక లోకేష్ అబద్ధం ఆడాడా..? పైగా పికినిక్‌కు వెళ్లాడని చెప్పాడు. 5వ తేదీన సీఐడీ నోటీసులు ఇస్తే.. 6వ తేదీన పిక్నిక్‌కు వెళ్లాడా..? లోకేష్, చంద్రబాబు పంపించారా..? టికెట్లు తీసి అమెరికా పంపించారని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పిక్నిక్‌కు వెళ్లాడో.. పారిపోయాడో సీఐడీ అధికారులు తేలుస్తారు. అవసరం అయితే ఇంటర్‌పోల్ సహాయం తీసుకొనైనా సరే తీసుకువస్తారు. స్కిల్ స్కామ్‌లో మా హస్తం లేదని సీమెన్స్ కంపెనీ అంటుంది. డబ్బులు వేరే కంపెనీకి మళ్లించారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టాడు. సంబంధం లేకపోతే సీఎం ఆర్డర్, సీఎం కోపం అని ఫైల్ నిండా ఎందుకు రాశారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టు చేసేటప్పుడు అందరికీ వచ్చే సాధారమైన సందేహం ఏంటంటే.. జీవో వచ్చిన రోజునే ఎంవోయూ ఎవరైనా చేస్తారా..? దాని అర్థం ఏంటీ..? చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు మీద ప్రేమ ఎందుకంటే డబ్బులు నేరుగా తన వద్దకు చేరుతాయి కాబట్టి. గుజరాత్‌లో సీమెన్స్‌కు డిజైన్ టెక్‌కు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 85 శాతం సీమెన్స్ పెడితే 15 శాతం గవర్నమెంట్ పెట్టాలి. గజరాత్ 15 శాతం కింద ఐదు సెంటర్లకు కలిపి 17 కోట్ల 10 లక్షల రూపాయలు పెట్టారు. సీమెన్స్ ఇచ్చిన రూ.99.85 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాకుండా సీఎస్‌ఆర్ కాంట్రిబ్యూషన్ చేసింది. ప్రతి కార్పొరేట్ కంపెనీ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద పెట్టే డబ్బు నుంచి కాంట్రిబూషన్ చేసింది. ఏపీకి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 6 క్లస్టర్స్‌కు కలిపి రూ.371 కోట్లు ఇచ్చింది. ప్రాజెక్ట్ ఖర్చు రూ.3281 కోట్లు. ఒకే రోజు, ఒకే విడతగా రూ.371 కోట్లు రిలీజ్ చేయించారు. మా తరఫు నుంచి డబ్బు రిలీజ్ చేశాం.. మీరు చేయాల్సిన రూ.2951 కోట్లు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎందుకు అడగలేదు. గుజరాత్‌లో ఎలా చేశారు.. ఏపీలో ఎలా చేశారనేది చాలా క్లియర్‌గా ఉంది. 90 శాతం డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా రాబట్టకపోగా.. గవర్నమెంట్ నుంచి రూ.371 కోట్లు రిలీజ్ చేయించిన చంద్రబాబుకు ఏం సంబంధం అని ఒక బ్యాచ్ వాదిస్తోంది. చంద్రబాబు ఒక వెహికిల్ వేసుకొని తిరగడం మొదలుపెట్టి సీఎం వైయస్ జగన్‌ను ఉద్దేశిస్తూ వాడకూడని భాషలో మాట్లాడాడు. వెహికిల్ మీద తిరుగుతూ సంయమనం కోల్పోయి నన్ను పీకుతారా.. నన్ను 40 ఏళ్లనుంచి ఏమీ చేయలేకపోయారు అని మాట్లాడాడు. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో నంద్యాలలో మీకు వయసు పెరిగిపోయింది, మీ హోదాను దృష్టిలో పెట్టుకొని హెలికాప్టర్‌లో విజయవాడ కోర్టుకు తీసుకెళ్తామని రమ్మంటే.. రోడ్డు మార్గంలో వస్తానని చెప్పాడు. రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చేసరికి బాలకృష్ణ సినిమాల్లో లాగా రోడ్ల నిండా జనం వచ్చేస్తారని పెద్ద డ్రామా చంద్రబాబు ఊహించుకున్నాడు. పెద్ద వంటోడు అని ఏడు బళ్లు కట్టి పెళ్లికి తీసుకువస్తే.. తోట కూర ఉడకబెట్టడానికి నీళ్లు ఎన్ని పోయాలని అడిగాడంట. అలా సిద్ధార్థ లూథ్రా అనే లాయర్‌ను తీసుకువచ్చారు. ఆయన 10 గంటలు వాదించాడు. రోడ్డు మార్గంలో బాబు విజయవాడకు వచ్చేలోగా సిద్ధార్థ లూథ్రా వచ్చేస్తాడని భావించి ఉంటాడు. సిద్ధార్థ లూథ్రా 10 గంటలు వాదిస్తే.. కోర్టు ఈ కేసులో ఉన్న నిజాలు, బలాలు చూసి చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఈ కేసులో రిమాండ్ తీర్పు ఇచ్చిన జడ్జి మహిళా న్యాయమూర్తి. ఆమె గురించి టీడీపీ దారుణంగా ట్రోల్ చేసింది. వ్యవస్థల మీద గౌరవం ఉందా..? వీళ్లు మనుషులేనా అనిపించేలా ట్రోల్ చేశారు. వాళ్లకు అనుకూలంగా తీర్పులు వస్తే.. పండగలు చేసుకున్నారు. కేసు మెరిట్ ఆధారంగా రిమాండ్ విధిస్తే జడ్జినే ట్రోల్ చేశారు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఒక ట్వీట్ చేశాడు. న్యాయ ఫలించనప్పుడు కత్తులతో పోరాటమే శరణ్యమని గురుగోవింద్ సింగ్ అనే నాయకుడు 1705లో చెప్పిన మాటను లూథ్రా ట్వీట్ చేశాడు. కోట్లు పెట్టి తీసుకువస్తే.. ఒక ట్వీట్ ఇచ్చాడు. నీ కేసులో బలమేమీ లేదు.. రోడ్లు ఎక్కి పోరాటం చేసుకోని అని చెప్పేశాడు. 164 వాంగ్మూలాలు, కేసులో జరుగుతున్న వ్యవహాలు, ఈడీ అరెస్టు చేసిన నిందితులు, జీఎస్టీ చెప్పింది కానీ, ఐటీ నోటీసులు చంద్రబాబు వల్లే ఇవన్నీ కుంభకోణాలు జరిగాయని క్లియర్‌గా చెబుతున్నాయి. ఇన్ని తప్పులు చేసి కూడా మాదే పై చెయ్యి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక దుర్మార్గుడిని, అవినీతి పరుడిని ఎల్లో మీడియా గొప్పగా చూపిస్తోంది.