ఉన్మాదిలా చంద్రబాబు ప్రవర్తన 

ఏం సాధిద్దామని ప్రజా చైతన్య యాత్ర

ప్రజలు 23 సీట్లకు పరిమితం చేసినా బుద్ధిరాలేదా బాబూ..?

పరిపాలన వికేంద్రీకరణను ప్రజలంతా కోరుకుంటున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ఉన్మాదిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తనను ప్రజలు ఓడించారు కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు.. అగ్ని గుండంలా తగలబడాలనే కుట్రతో చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నాడన్నారు. నెల్లూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధాంతాలు లేని వ్యక్తి, నీతి, నిజాయితీ లేని వ్యక్తి చంద్రబాబు, నిద్ర లేచింది మొదలు అన్నీ అబద్ధాలే మాట్లాడుతాడని దుయ్యబట్టారు. మూడు రాజధానులు ఉండాల్సిందేనని చంద్రబాబు మాట్లాడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని, యూటర్న్‌ తీసుకోవడంలో బాబును మించిన ఘనుడు ఎవరూ లేరన్నారు.

రాష్ట్ర ప్రజలంతా పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కాకాణి చెప్పారు. దీనిపై చంద్రబాబు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. అసలు ఏం సాధిద్దామని ప్రజా చైతన్య యాత్ర పెట్టావు చంద్రబాబూ అని కాకాణి ప్రశ్నించారు.  టీడీపీ సభలకు జనాలు రారని తెలిసి.. నిన్నటి రోజున తన సొంత నియోజకవర్గం కుప్పంలో సభ పెట్టి నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడని మండిపడ్డారు. ప్రజా చైతన్య యాత్ర అసలు ఎందుకు పెట్టావు.. అమరావతిని అభివృద్ధి చేయాలని పెట్టావా..? లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని ఓడించాలని చెప్పడానికి పెట్టావా..? మతిభ్రమించిందా..? అల్జీమర్స్‌ వ్యాధి ముదిరిందా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

ప్రజలకు చైతన్యం ఉండబట్టే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్న సమయంలో బయటకు రాని నారా భువనేశ్వరి హెరిటేజ్‌కు సంబంధించిన ఆస్తులు పోతున్నాయని బయటకు వచ్చి గాజులు దానం చేసిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ప్రజలంతా కోరుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేయకుండా.. సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ఇకనైనా తన స్వార్థ ప్రయోజనాలు మానుకోవాలని సూచించారు. 
 

Back to Top