పేదలంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

తాడేపల్లి:    ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద‌ల‌కు మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే..ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ప్ర‌తి దానికి అడ్డు త‌గులుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ మండిప‌డ్డారు.  పేదలంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు.. జులై 8వ తేదీ రాష్ట్రంలో   30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీకారం చుట్టార‌ని, వాటిని అడ్డుకోవాలని హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేశారని ఆయన ధ్వజమెత్తారు.  పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమ‌ర్శించారు.  టీడీపీ నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు తన హయాంలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? హైదరాబాద్‌లో మాత్రం ఆయన ఇంద్ర భవనం కట్టుకున్నార‌ని ఫైర్ అయ్యారు.  

ఆగ‌స్టు 15న ఇళ్ల ప‌ట్టాలు
ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజల కష్టాలు చూడాలి కానీ, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఆపాలి అని కుట్రలు చేస్తున్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  పాలన అనగానే సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని, కానీ చంద్రబాబు పాలన చూస్తే సర్వం అవినీతి అవినీతిమయం అని, భూ దందాలు, విశాఖ కుంభకోణాలు గుర్తుకొస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేశం మొత్తం అశ్చర్యపడేలా 108,104 వాహనాలను సీఎం ప్రారంభించారని జోరి ర‌మేష్‌ పేర్కొన్నారు. 
 

Back to Top