చంద్రబాబులో అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు

టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

విజయవాడ: దళితులపై దాడి చేసిన దేవినేని ఉమా ఇంటికి ఎలా వెళ్తారని చంద్రబాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదని, కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే చంద్రబాబు వచ్చారని, పరామర్శ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. మైనింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీతో మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా..? అని టీడీపీని ప్రశ్నించారు. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తామన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top