సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

కర్నూలు: ఆరు దశాబ్దాల తరువాత కర్నూలును మళ్లీ రాజధానిగా ప్రకటించి మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలుకుతామని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. కర్నూలుకు జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా వాసులంతా జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. రేపు (మంగళవారం) సీఎం వైయస్‌ జగన్‌ కర్నూలు పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పరిశీలించారు. ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం హఫీజ్‌ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కంటివెలుగు ఫేజ్‌–3 ప్రారంభించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కర్నూలు వస్తున్నారన్నారు. వృద్ధులకు, పెద్దలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, శస్త్ర చికిత్సలు ఈ పథకం ద్వారా చేయిస్తారన్నారు. అంతేకాకుండా మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని వివరించారు. కంటి వెలుగు ఫేజ్‌–3ని కర్నూలులో ప్రారంభించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొట్టమొదటి సారి సీఎం హోదాలో కర్నూలుకు వస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలకనున్నామని, ఎస్‌ఏపీ క్యాంపు నుంచి ఎస్టీబీసీ కాలేజీ వరకు రోడ్డు పొడవునా మానవహారం నిర్వహించబోతున్నామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top