దొంగల పరామర్శకే సమయం ఉందా బాబూ..?

చంద్రబాబుపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

విశాఖపట్నం: చంద్రబాబు లాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఈ దేశంలోనే లేడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నాలుగుసార్లు తిరిగిన చంద్రబాబు.. అదే విజయవాడ నుంచి విశాఖ వచ్చి ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అవినీతిపరుడు, కార్మికుల పొట్టకొట్టి రూ.కోట్లు దోచుకున్న అచ్చెన్నాయుడి లాంటి దొంగను పరామర్శించేందుకు వెళ్లాడు కానీ, ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించాలనే ఆలోచన రాకపోవడం బాధాకరమన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

కార్మికులకు సొమ్మును పందికొక్కుల్లా చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన అచ్చెన్నాయుడు, అధికారులు దాదాపు రూ.150 కోట్లు మింగారని ధ్వజమెత్తారు.  దొంగను అరెస్టు చేసి జైలులో పెడితే.. ఆ దొంగను పరామర్శించేందుకు చంద్రబాబుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. అచ్చెం అరెస్టును కిడ్నాప్‌గా అభివర్ణిస్తూ చంద్రబాబు మాట్లాడాడని, అవినీతిపరుడి అరెస్టును కులాలకు ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించలేదు కాబట్టి.. ఎక్కడ ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను తప్పుబడతారనే ఉద్దేశంతో మొసలికన్నీరు కారుస్తూ.. చంద్రబాబు లేఖలు రాశాడని మండిపడ్డారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద మనసుతో ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, చికిత్స పొందిన వారికి రూ.10 లక్షల నుంచి రూ.25 వేల వరకు, బాధిత గ్రామాల ప్రజలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. చరిత్రలో నేటి వరకు ఇంత పెద్దసాయం ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు రూ.50 వేలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటానని చంద్రబాబు దురదృష్టకరమన్నారు. కోటి రూపాయల పరిహారం ఏం సరిపోతుందని మాట్లాడిన దౌర్భాగ్యుడు రూ.50 వేల ఇచ్చి ఎలా ఆదుకుంటాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన ఓఎన్‌జీసీ, గోదావరి పుష్కరాల మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 
 

Back to Top