సీఎం రాకతో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాకతో ఉత్తరాంధ్రకు సంక్రాంతి పండుగ పది రోజుల ముందే వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం సిటీ, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా పండుగ చేసుకుంటున్నారు. అన్ని జిల్లాలను సమదృష్టితో చూసి విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్‌గా ప్రతిపాదించడాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆమోదిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆలోచనలు చేయడం మంచి నిర్ణయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. 
 

Back to Top