దళితుల ఆత్మహత్యలు.. టీడీపీ ప్రభుత్వానికి పట్టవా..

న్యాయం చేయాలంటూ  ఎమ్మెల్యే ఆర్కే రోడ్డుపై భైఠాయింపు..

గుంటూరు:పోలీసుల వేధింపుల వల్లనే మంగళగిరిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న  కుటుంబసభ్యులకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఆత్మహత్యలు చేసుకున్న దంపతుల తల్లిదండ్రులు న్యాయం చేయాలని రోడ్డు ఎక్కిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన ఎస్‌ఐని అరెస్ట్‌ చేయాలన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీసులు తీవ్ర హింసలకు గురిచేయడం దారుణమన్నారు.

న్యాయం చేయాలని ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల  తల్లిదండ్రులు వేదన చెందుతున్న కూడా ఒక అధికారి కూడా రాలేదన్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.ఇద్దరు దళితులు ఆత్మహత్యలు చేసుకున్న కూడా ప్రభుత్వంలో స్పందనలేదని మండిపడ్డారు.

Back to Top