25న సీబీఐటీలో వైయ‌స్ఆర్‌సీపీ మెగా జాబ్‌ మేళా 

పోస్టర్లు, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి 

 వైయ‌స్ఆర్‌ జిల్లా : చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో  25న వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీబీఐటీలో  మీడియాతో మాట్లాడి, జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్‌ ((WWW.YSRCPJOBMELA.COM))ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
 
ఇప్పటికే తిరుపతి, వైజాగ్, గుంటూరులో జాబ్‌ మేళాల ద్వారా 40,243 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పొత్తులు ఉన్నా లేకున్నా తమ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, సుపరిపాలన అందించే తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 స్థానాల్లో గెలిపిస్తారని స్పష్టం చేశారు.  చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలకు ఉపయోగకరంగా ఏదీ ఆలోచించరని, అది వారికి పుట్టుకతో వచ్చిందని, ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తారని విజయసాయిరెడ్డి విమర్శించారు.   

Back to Top