‘వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ పనితీరు అద్భుతం’ 

మాజీ మంత్రి,  గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు 
 

గుంటూరు:  తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి,  గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.

ఈరోజు(శుక్రవారం, జూన్‌ 13) గుంటూరులో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్‌, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో పాటు  జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు.  వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. 

దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్‌ సెల్‌  అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది..  రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.

ఇవి పథకం ప్రకారం చేసే దాడులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. 

ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్ వైయ‌స్‌ జగన్‌ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని  వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. 

కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు.

Back to Top