అంబేద్క‌ర్ ఆలోచ‌న విధానంతో వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

తిరుప‌తిలో అంబేద్క‌ర్ విగ్ర‌హానికి వైయ‌స్ఆర్ సీపీ నేత‌ల ఘ‌న నివాళి 

తిరుప‌తి:  భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆలోచ‌న విధానంతో ఏపీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న సాగిస్తున్నార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   130 వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బస్టాండ్ దగ్గర వ‌ద్ద ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు  పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ.. డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ సామాజ శ్రేయస్సు కోసం తన జీవి తాన్ని ఆర్పించిన మహానీయుడని,  ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు అంకి తమవ్వాలని పిలుపునిచ్చారు.  రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయమన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ మన్ననలు పొందిందని వివరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంబేద్కర్‌ ఆలోచన విధానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ..కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసి అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. 

Back to Top