వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల సంతాపం

   హైదరాబాద్‌: వైయస్ఆర్‌ సోదరుడు, మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం పట్ల వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంక‌ట్రామిరెడ్డి, త‌దిత‌రులు సంతాపం తెలిపారు.  వైయ‌స్‌ వివేకానందరెడ్డి గొప్ప మానవతావాది అని, ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. తన తమ్ముడు చాలా సౌమ్యుడని వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వివేకానందరెడ్డి మరణం చాలా బాధ కలిగించిందన్నారు. 

Back to Top