చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిపై డీజీపీకి ఫిర్యాదు

జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణం

 ఎమ్మెల్యే ఆర్కే

గుంటూరు:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయాలని వారు కోరారు. జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఎమ్మెల్యే మెరుగ నాగార్జున అనుమానం వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆసుపత్రిలో ఉంటే పరామర్శించని చంద్రబాబు..ఇవాళ అకస్మాత్తుగా ఆయనపై ప్రేమను పెంచుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇన్ని దారులకు పాల్పడిన టీడీపీ నేతలు తిరిగి మా పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. అసలు చంద్రబాబుకు సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఈ రాష్ట్రంలో ఇళ్లు ఎక్కడ ఉందని నిలదీశారు. ఆ ఇళ్లు నీది కాదని హైకోర్టు నోటీసు ఇచ్చినా కూడా అక్కడే వేలాడుతున్నారని విమర్శించారు. జోగి రమేష్‌కు ఏమైనా అయితే బాధ్యులు ఎవరని నిలదీశారు. రౌడీలను తీసుకువచ్చి హింసను ప్రోత్సహిస్తున్నారని తప్పుపట్టారు. రాజకీయంగా చంద్రబాబు సమాది అయ్యారన్నారు. అధికారంలో ఎవరున్నారు..దాడులు ఎవరిపై జరుగుతున్నాయో గమనించాలని కోరారు. రేపు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు రాబోతుండటంతో ఈ అంశాన్ని డైవర్ట్‌ చేసేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. బీసీ సోదరులు చంద్రబాబు తీరును గమనించాలని విజ్ఞప్తి చేశారు. అయ్యన్నపాత్రుడితో చంద్రబాబే మాట్లాడిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

ప్రజల మధ్య బాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: ఎంపీ నందిగాం సురేష్‌
ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఎంపీ నందిగాం సురేష్‌ మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్, హోం మంత్రి మేకతోటి సుచరితపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే అందరికీ ప్రమాదమేనని, వారిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. జోగి రమేష్‌పై దాడికి పాల్పడిన పాత్రదారులందరిని అరెస్టు చేసి లోపల ఉంచితే..మిగతా వాళ్లకు సిగ్గొస్తుందని అభిప్రాయపడ్డారు. 

తాట తీస్తాం: ఎమ్మెల్యే జోగి రమేష్‌
చంద్రబాబుకు సిగ్గుందా? వ్యవసాయం దండగ అన్న వ్యక్తివి నువ్వూ..ఇవాళ వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తావా?. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారు.. అయ్యన్నపాత్రుడిది నోరా? తాటిమట్టా? ఇలాంటి వెధవలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబును హెచ్చరిస్తున్నాం. పద్దతి మార్చుకోకపోతే ఎస్సీ, ఎస్టీలు మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వరు. పనికిరాని ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఆయనకు ఇక్కడ ఆధార్‌కార్డు లేదు. ఇళ్లు లేదు. విజిటింగ్‌ నాయకుడు చంద్రబాబు. ఆయన కుమారుడు లోకేష్‌ మాట్లాడుతున్నారట..కూతవేటు దూరంలో సీఎం ఇళ్లు ఉందంటున్నారట..తాట వలుస్తాం. వైయస్‌ జగన్‌ వైపు కన్నెత్తి చూసే అర్హత ఈ లోకేష్‌కు లేదు. లోకజ్ఞానం లేని చవట, దద్దమ్మకు వైయస్‌ జగన్‌ ఇంటి వైపు చూసే దమ్ముందా?..వైయస్‌ జగన్‌ ఒక వ్యక్తి కాదు.. ఆయన వ్యవస్థ. ఒక్క అడుగు వేస్తే..తాటి మట్టలతో తరిమికొడతాం. శాంతియుతంగా నిరసన తెలిపితే..నాపై దాడి చేయిస్తారా? ..చంద్రబాబు, లోకేష్‌లను ఎస్సీ, ఎస్టీలు తరిమికొడతారని జోగి రమేష్‌ హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top