అప్పుల‌పై ఇన్నాళ్లు అడ్డ‌మైన కూత‌లు..దారుణ‌మైన రాత‌లు

అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించార‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలిశాయ‌న్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో శివ‌శంక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ‘‘ రాష్ట్ర అప్పుల‌పై ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన మొత్తంగా వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే అప్పులే. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.
 
 

Back to Top