ఓటర్ల  నమోదు కేంద్రాల్లో పసుపు–కుంకుమ చెక్కులా?

టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం..

 రైతు కోటయ్య మృతిపై చంద్రబాబు,మంత్రి బాధ్యత వహించాలి..

బలహీనవర్గాలు,దళితులకు టీడీపీ పాలనలో తీవ్ర అన్యాయం..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి..

విజయవాడ: బలహీనవర్గాల కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు నటిస్తూ.. ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్నటి వరుకు వైయస్‌ఆర్‌సీపీకి చెందిన సానుభూతిపరులను ఓట్లను ఓటరు లిస్ట్‌ నుంచి తొలగించిన టీడీపీ.. నేడు ఎలక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న క్యాంపులను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఓటర్లు నమోదు కేంద్రాల్లో పసుపు–కుంకుమ చెక్కులను పంపిణీ చేయడం దిగజారుడుతనమన్నారు.సంక్షేమ పథకాలను ఓట్ల పొందే ఆయుధంగా మలుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టుగా అభివర్ణించారు.దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌ వెంటనే విచారణ నిర్వహించి,తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.బలహీనవర్గాలకు చెందాల్సిన సంక్షేమ పథకాలను నీరుగార్చారన్నారు. ఫీజు రీయింబర్‌మెంట్,గృహనిర్మాణం, రైతుల బకాయిలను పక్కనపెట్టి..ఎన్నికల ముందు అభివృద్ధి కోసం కొత్త పథకాలు కనుగొనట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఐదేళ్లలో బలహీనవర్గాలకు చంద్రబాబు అన్యాయం చేశారు. కేవలం పెట్టుబడి దారి వర్గాలకే కొమ్ముకాశారన్నారు. దానిపై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు.

బలహీనవర్గానికి చెందిన రైతు కోటయ్య మరణంపై చంద్రబాబు,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు బాధ్యత వహించాలన్నారు.దానిపై విచారణ సమగ్ర జరపకుండా మసిపూసి మారేడుకాయ చేసి తప్పించుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు బలహీనవర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే కోటయ్య మృతిపై సిబిసిఐడితో గాని, సిట్టింగ్‌ జడ్జితో గాని విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాలు,దళితుల భూములు లాక్కోవడం అంటే చంద్రబాబుకు చాలా సరదా అని అన్నారు. దానిని చాలా చిన్న విషయంగా చంద్రబాబు పరిగణిస్తారని ధ్వజమెత్తారు.పేదవారికి సంబంధించినది లాక్కొవడానికి వెనకాడని మనస్వతం చంద్రబాబుది అని దుయ్యబడ్డారు.ఐదు సంవత్సరాల్లో పారిశ్రామిక వేత్తలకు,ఇనిస్టిట్యూట్‌లకు కొన్ని వేల ఎకరాలు కేటాయించిన చంద్రబాబు.. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఎంత భూ కేటాయింపులు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బలహీనవర్గాలందరూ ఓటు బ్యాంకు అంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు.. బలహీనవర్గాలకు,దళితులకు ఎన్ని నామినేటేడ్‌ పదవులు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

ఐదేళ్లలో బలహీనవర్గాలకు చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు.చివరకు బలహీనవర్గాలను,దళితులను ఎంతగా అమానిచారంటే..ఒక కొత్త రాష్ట్రంలో  రాజధాని ఏర్పాటు అనేది చారిత్రాత్మక సంఘటన అని.. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఒక బలహీనవర్గానికి చెందిన వ్యక్తికి గాని,దళిత వ్యక్తికి గాని స్థానం కల్పించారా అని ప్రశ్నించారు.చంద్రబాబు ప్రవర్తన బలహీనవర్గాలను కించపరిచేవిధంగా ఉందన్నారు. అదేవిధంగా టీడీపీ నేతల ప్రవర్తన కూడా అలాగే ఉందన్నారు.చింతమనేని ప్రభాకర్‌ దళితులను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడిన కూడా కనీసం నోరువిప్పని చంద్రబాబుకు దళితులు ఓట్లు వేయడం అంటే..దళితులు తమను తము కించపరుచుకునట్లే అని అన్నారు.పదవులు,వ్యాపారాలు, రాజకీయాలను చంద్రబాబు తన సొత్తుగా భావిస్తున్నారని తూర్పారబట్టారు.ఐదు సంవత్సరాల్లో అనేక కాంట్రాక్టులు,నామినేటేడ్‌ వర్క్‌లు ఇచ్చారని, దానిపై కూడా శ్వేత పత్రం విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు.చంద్రబాబు సామాజికవర్గాలను అన్యాయం చేయడమే కాదు..బ్రోకర్‌లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సెక్రటేరియట్‌..  టెండర్లు,భూ కేటాయింపులకు బ్రోకర్ల వ్యవస్థలాగా పనిచేస్తుందని ధ్వజమెత్తారు.అన్న దాత సుఖీభవ, పసుపు–కుంకుమ అంటూ ప్రజలను చులకన చేస్తున్నారని మండిపడ్డారు.డబ్బులు ఇస్తే.. ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తున్నారని ధ్వజమెత్తారు.బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. పోస్ట్‌డేటెట్‌ చెక్కులు ఇచ్చి వారిని గుప్పింట్లో పెట్టుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీతో తిరిగితే మీ డబ్బులు ఖాతాల్లో వేయమని బెదిరింపులకు దిగుతున్నారన్నారు.

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారన్నారు.చంద్రబాబు ప్రభుత్వానికి చివరి ఘడియలన్ని, అరాచకాలకు చరమగీతం పాడడానికి సమయం ఆసన్నమయిందన్నారు.చంద్రబాబు విపరీత ధోరణికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.బలహీనవర్గాలకు,దళితులకు ఉపయోగపడే విధంగా దాదాపు రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు వున్నాయని..ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు .చివరకు ఏపీపీఎస్సీ వెల్లువరిచిన నోటిఫికేషన్లలో కూడా బలహీనవర్గాలకు అన్యాయం జరిగే నిబంధనలు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడంలేదంటే ఎంత దారుణమో బలహీనవర్గాలు ఆలోచించాలన్నారు.ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని రంగాల్లో కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేయడానికి మాత్రమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు.

రిజర్వ్‌డ్‌ కేటగిరి యువతయువకుల అవకాశాలను దెబ్బకొట్టడం కోసమే జౌట్‌సోర్సింగ్‌ విధానం తీసుకొచ్చారని తెలిపారు.చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు భర్తీచేయాలన్నారు.జౌట్‌సోర్సింగ్‌ విధానంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు..అప్పుడు ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన కూతురిని చూడడానికి ఐదు రోజులు విదేశాలకు వెళ్ళితే..ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారనిమండిపడ్డారు.చంద్రబాబు మానసిక స్థాయి ఏవిధంగా ఉందో రాష్ట్ర ప్రజలు అర్థంచేసుకోవాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top