ఎందుకు ఇంత రాద్ధాంతం

 వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు మార్గాని భరత్‌
 

పశ్చిమగోదావరి : పదవుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ను కలిసినప్పుడు ఏం మాట్లాడనివారు.. ​ఇప్పుడు కేటీఆర్‌, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిస్తే మాత్రం ఎందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారంటూ   వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు మార్గాని భరత్ ప్రశ్నించారు. శనివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..వైయ‌స్‌ జగన్‌ - కేటీఆర్‌ కలయిక గురించి తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమిని స్వాగతించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరుగుతుంటే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసి పోరాటం చేయడమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్‌, జగన్‌ను కలిశారన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Back to Top