బాబూ..నీ పాపం పండింది

చంద్రబాబు నా అల్లుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా

చంద్రబాబు లాంటి నీచుడ్ని చరిత్రలో ఎక్కడా చూడలేదు 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాబు నాటకాలు ఎక్కువయ్యాయి

మహిళలను అడ్డం పెట్టుకొని నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు

ఉద్యమం పేరుతో రైతుల నుంచి 70 లక్షలకు పైగా వసూలు చేశారు

ఎన్టీఆర్‌కు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటే చంద్రబాబు ఆత్మహత్య చేసుకుంటాడు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి

తాడేపల్లి: చంద్రబాబు పాపం పండిందని, ఆయనకు రోజులు దగ్గరపడ్డాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి హెచ్చరించారు. మహిళలను అడ్డుపెట్టుకొనిచంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తన  భర్త ఆత్మ చంద్రబాబును చూస్తునే ఉందన్నారు.  చంద్రబాబు నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేశావా? నా అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ప్రశ్నించారు.  ఈ రోజే కాదు..ఎన్నోసార్లు సిగ్గుపడ్డానని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక కోర్టులో కేసులు ఎలా వేశారో చూశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తే..రిజర్వేషన్లపై చంద్రబాబు తన మనిషి ప్రతాప్‌రెడ్డితో సుప్రీం కోర్టులో కేసు వేయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు 50 శాతానికి మించకూడదని  ఆదేశించింది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఒప్పుకుంటే..దీనిపై మరో కేసు వేశారు. బీసీలు నష్టపోతున్నారని చంద్రబాబు ముసలి కన్నీరు కార్చుతున్నారు. ఆయన హయాంలో బీసీలకు ఏదో మేలు చేసినట్లు చెబుతున్నాడు. ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదు. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక అంశంపై అడ్డుపడుతున్నారు. 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అందులో మోసం జరిగిందని కేసులు వేశాడు. దిశ యాక్ట్‌ తెస్తే ..అందులో తప్పుడు విధానాలు ఉన్నాయని కేసులు వేశారు. మా సీఎం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ చట్టం తెస్తే..చంద్రబాబు అమరావతిలో ఆడవాళ్లను అడ్డుపెట్టి ఆందోళన చేపడుతున్నాడు. కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నాడు. ఎక్కడో జరిగిన దురాఘాలను సోషల్‌ మీడియాలో చూపించి అమరావతిలో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశాడు. అమరావతి ఉద్యమంపై పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారు. చివరకు లేడీ కానిస్టేబుళ్లను అవమానించారు. మహిళ పోలీసులు బట్టలు మార్చుకుంటే ఎల్లో మీడియా వీడియోలు తీయించింది. చంద్రబాబు దారుణంగా దిగజారిపోయారు. మహిళలను అడ్డు పెట్టుకొని డ్రామాలాడుతున్నారు. ఆ రోజు  ఎన్టీఆర్‌ చంద్రబాబును మెడ పట్టి పార్టీ నుంచి బయటకు తోసేశారు. అలాంటి వ్యక్తి అడ్డదారిలో లక్ష్మీ పార్వతి వద్దకు వచ్చి అమ్మా..అమ్మా అంటూ బతిమిలాడారు. చివరకు ఒంటె ప్రవేశం లాగా పార్టీలోకి వచ్చి నాపైనే నిందలు వేశాడు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ప్రాణం తీసి నీచమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యవస్థలో ఎందుకు ఉన్నాడో ..ఆయన్ని అల్లుడు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నా..కమ్మ కమ్యూనిటి అనేది ఒకప్పుడు ఎంతో గొప్ప జాతి. ఈ దుర్మార్గుడి వలలో పడి అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. అమరావతికి భూములు ఇవ్వమంటే ఆ రోజు చంద్రబాబు పోలీసులను  ఉపయోగించుకొని బలవంతంగా భూములు లాక్కున్నారు. ఈ రోజు తన బినామీలు కొన్న ఆస్తులను కాపాడేందుకు అన్యాయంగా ఇంట్లో ఉన్న మహిళలను రోడ్డుపైకి తెచ్చి ఉద్యమం నడిపిస్తున్నారు. ఆఖరికి భువనేశ్వరిని కూడా ఈ ఉద్యమంలోకి లాగారు. ఆమె గాజులు కూడా లాక్కున్నాడు. రెండు గాజులు తన భార్య చేత విరాళంగా ఇప్పించిన చంద్రబాబు..చివరకు 24 గాజులు సంపాదించాడు.  ఉంగారాలు 29, చెవి పోగులు 41, బ్రాస్‌లెట్స్‌ 2, బంగారు గాజులు 3, నల్లపూసల గొలుసులు రెండు తీసుకున్నారు. వెండీ పట్టీలు, వెండి గొలుసులు లాక్కున్నాడు. ఇవన్నీ కూడా ఆడవాళ్లవే. ఉద్యమం చేసే వారు తన డబ్బులు ఖర్చు పెట్టాలి. అవినీతితో లక్షల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బు పెట్టవచ్చు కదా?. అవినీతి సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటాడు. అమరావతి రైతులకు ఆ డబ్బులు ఖర్చు చేయవచ్చు కదా? ఆ రైతులతో రూ.70 లక్షలు వసూలు చేసి అమాయక రైతులను రోడ్డుపైకి లాగారు.
ఆ రోజు ఇందిరాగాంధీని నమ్మి టికెట్ ఇస్తే..ఆమెను మోసం చేసి ఎన్టీఆర్‌ పంచన చేరాడు. ఎన్టీఆర్‌ పిల్లనిస్తే..మామకే ద్రోహం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని నీచమైన రాజకీయాలు చేసి లక్ష్మీ పార్వతిని రోడ్డుపైన పారేసిన నీచమైన వ్యక్తి చంద్రబాబు. ఈ రోజు కూడా అంతే మళ్లీ ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని అమరావతి ఉద్యమం అంటున్నాడు. ఆడవాళ్లనే ఎందుకు వాడుకుంటావ్‌?. నికృష్టమైన రాజకీయం చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేరు. జీవితంలో ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేకపోయారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమయంలో పోలవరం ప్రారంభిస్తే..ఒరిస్సాతో మాట్లాడి వాళ్ల చేత కేసు వేయిస్తావు. పోతిరెడ్డిపాడుపై నిర్ణయం తీసుకుంటే తెలంగాణ నేతలతో కేసు వేయించావు. ఇప్పుడు కూడా వైయస్‌ జగన్‌ నాలుగున్నర ఉద్యోగాలు ఇస్తే దానిపై కేసు, దిశ చట్టంపై కేసు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే దానిపై కేసు వేయిస్తున్నావు. నీ కేసులు చూస్తే..ఎంత నీచమైన స్థితిలో ఉన్నావంటే ఏలేరు స్కామ్‌ నుంచి ఇప్పటి దాకా చూస్తే..అన్ని కేసుల్లో నీవే ఉన్నావు. మా నాయకులు వైయస్‌ జగన్‌పై వేసిన కేసులు చూస్తే..నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గర్వకారణం. మాకే కాదు ప్రపంచానికే గర్వకారణం. మహిళలకు దిశ చట్టం, అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలకు చదువు చెప్పించాలనే మంచి సంకల్పం. ఇలాంటి పనులపై నీవు కోర్టుకు వెళ్లడం సిగ్గు చేటు. ఇలాంటి పనులు చేయాల్సింది ఏ పని లేని వెధవలు, ఆవారాగాళ్లే..వాళ్లకు చంద్రబాబుకు ఏమీ తేడా లేదు.అమరావతి రైతుల కోసం చివరకు అంతర్జాతీయ కోర్టులో కేసు వేయించడం సిగ్గు చేటు. దుబాయిలో సదస్సు జరిగితే అక్కడ కూడా ఏపీ గురించి మాట్లాడుతావు. అసలు నీకు ఆంధ్రప్రదేశ్‌ అక్కర్లేదా?. మూడు ప్రాంతాల్లో ఉన్న పేదలతో పని లేదా? రాయలసీమ వలస రైతుల గురించి, ఉత్తరాంధ్ర కూలీల గురించి నీకు ఆవేదన లేదా?. బీసీ వర్గాలకు మా ప్రభుత్వమే కదా మంచి చేస్తోంది. అమ్మ ఒడి పథకం ఎక్కువ శాతం బీసీలకే కదా  ఇచ్చింది. ఉద్యోగాల్లో కూడా బీసీలకే ఇచ్చాం కదా?. ప్రతి దాంట్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నావే..కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నావే..నీ ఈర్శ్యకు అంతం లేదా? నీ దుర్మార్గం ఇంకా ఆపలేవా?. ఇప్పటికే 72 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఎన్నాళ్లు ఉంటావు. మూడు, నాలుగేళ్లు ఆరోగ్యంగా తిరుగగలుగుతావేమో? ఆ తరువాత ఈ పాపాలన్నీ తలుచుకొని కనీసం యముడికైనా సమాధానం చెప్పాలి కదా?. నీ జీవితంలో, నిఘంటువుల్లో ఒక్క మంచి పనైనా చేశావా?. ఒక దుర్మార్గపు వ్యవస్థను నీకు నీవే సృష్టించుకొని, నీ స్వార్థం కోసం అనేక మందిని బలిగొన్నావు. మా ఆయన ఎన్టీఆర్‌ అయితే ఎన్ని రకాలుగా అన్నాడో అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు ఆత్మహత్య చేసుకుని చనిపోతావని అన్నారు. అయినా సరే సిగ్గు, ఎగ్గు లేకుండా, ఉమ్మేసినా తుడిచేసుకునే నీచమైన బతుకు చంద్రబాబుది. అవినీతి, స్వార్థం, అధికారమే తప్ప..మంచి, మానవత్వం, విలువలు, సమాజం అన్నవి ఆయనకు పట్టవన్నారు.  చంద్రబాబు నీచ రాజకీయాలతో దారుణంగా దిగజారిపోయారని మండిపడ్డారు. 
మంచి పనులు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లుతున్నావు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి అనేక రకాలుగా నీచమైన ప్రయత్నాలు చేస్తున్నావు. బాబు..నీ పాపం పండింది. తొందర్లోనే రోజులు దగ్గర పడ్డాయి. నా భర్త ఆత్మ నిన్ను చూస్తునే ఉంది. ఏవిధంగా నీ పతనం చేయాలో..అది కూడా ఎంత ఘెరంగా, అన్యాయంగా ఆయన్ను పొట్టన పెట్టుకున్నావో అంతకంటే దారుణంగా నీచ, నికృష్టమైన స్థితిలో అంతిమ ప్రయాణం ఉంటుందని నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎంతో మంది ఆడవాళ్లం దగా పడ్డాం. ఆయన హయాంలోనే కదా కాల్‌మనీ.. సెక్స్‌ రాకెట్లు నడిపారని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. 

 

Back to Top