శవ రాజకీయాలు టీడీపీ నైజం

వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు
 

కాకినాడ:  శవ రాజకీయాలు తెలుగు దేశం పార్టీ నైజమనిౖ వెయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. టీడీపీకి అధికార మదం ఎక్కువైందని ఆయన మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌పై  ఆయన ఫైర్‌ అయ్యారు. వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని వ్యాఖ్యానించారు. జనంలోంచి గెలవలేక దొడ్డిదారిన లోకేష్‌ మంత్రి అయ్యారని చురకలంటించారు. వైయస్‌ జగన్‌ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడన్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ను భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడిగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు.మూడు నెలల్లో టీడీపీ కథేంటో తేలిపోతుందని హెచ్చరించారు. 
 

Back to Top