ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలం

అప్పుల రాష్ట్రంగా ఏపీని తయారుచేశారు..

పోలవరం జీవోలన్ని రహస్య జీవోలే

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: తన పాలనలో ఏం మేలు జరిగిందో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని వైయస్‌ఆర్‌సీసీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు బాబు సిద్ధపడింది నిజం కాదా అన్ని ప్రశ్నించారు. ఏ పార్టీతోనూ వైయస్‌ఆర్‌సీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరాన్ని తీసుకున్నారని ధ్వజమెత్తారు.పోలవరం గేటు చూపించడానికి రూ.400 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.పోలవరం జీవోలన్ని రహస్య జీవోలే అని ఆగ్రహ వ్యక్తం చేశారు.ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు.ఆరు నెలలుగా అన్ని బిల్లులు స్తంభించిపోయాయన్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు.

 

 

Back to Top