ప్రత్యేకహోదా సాధించడమే వైయస్‌ జగన్‌ ధ్యేయం

ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్‌

చంద్రబాబుకు ఎన్నిసార్లు అవకాశమిస్తే అన్ని సార్లు ఏపీ నష్టబోతుంది

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

 

విశాఖపట్నం: ప్రత్యేకహోదాపై వైయస్‌ జగన్‌ ఒకేమాటపై నిలబడి చిత్తశుద్ధితో పోరాటం చేస్తే..చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.  ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని..హోదా వద్దు.ప్యాకేజీ ముద్దు  అన్న చంద్రబాబు నేడు ప్రత్యేకహోదా కావాలంటున్నారన్నారు.రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావడమే వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు.ఉక్కు సంకల్పంతో వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారు.రాష్ట్రానికి ప్రత్యేకహోదాయే శరణ్యమన్నారు.ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.రాయితీలతో పాటు పరిశ్రమలు వస్తాయన్నారు.చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఏపీలో ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసి తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు కోసం డేటా కంపెనీలకు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం 23 మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది వాస్తవం కాదా అని  ప్రశ్నించారు. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరీ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మీ కులతత్వం కాదా అని ప్రశ్నించారు.కొండవీడులో కోటయ్య ప్రాణాలు బలి తీసుకుంది వాస్తవం కాదా.. 2004కు ముందు చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నారు.ఇప్పుడు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.చంద్రబాబుకు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే అన్ని సార్లు ఏపీ రాష్ట్రం నష్టపోతుంది.సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకున్నారన్నారు.

Back to Top