ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌తి గ‌డ‌ప‌కూ తీసుకెళ్తాం

ప్రజల ఆశీస్సులు పొందే సమయం మొదలైంది

ఇచ్చినమాట కంటే మిన్నగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

ఈ మూడేళ్లలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు

ప్రజాసేవను సీఎం వైయస్‌ జగన్‌ బాధ్యతగా భావిస్తున్నారు

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం పార్టీ ప్రధాన కర్తవ్యం

రేపు పార్టీ నేతలకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ప్రజలకు సేవ చేయడాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక బాధ్యతగా భావిస్తున్నారని, ప్రజల జీవితాలు మెరుగుపరచాలనే చిత్తశుద్ధితో ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై రేపు (ఈనెల 27న) జరిగే విస్తృతస్థాయి సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. తనలాగే తన టీమ్‌ కూడా ప్రజలకు సేవ చేయడం, నిత్యం అందుబాటులో ఉండటం, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా పనిచేయాలని సీఎం కోరుకుంటున్నారని చెప్పారు. 

తాడేపల్లిలోని తన కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్ల పదవులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ మూడేళ్లలో అందరూ అనుకున్నదానికంటే, మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే మిన్నగా సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామ, వార్డు సచివాలయాలు, డీబీటీ సిస్టమ్‌ ఇలా అనేక సంస్కరణలు తీసుకువచ్చి, పారదర్శకతకు పెద్దపీట వేశారన్నారు. 

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మరో రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు వెళ్లి మరోసారి ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు సమయం మొదలైందన్నారు. ప్రజల గడప వద్దకే పాలన, సంక్షేమం అంటే ఒక్కరోజు తాయిళాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తు మార్చేవిధంగా, భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షం లేనది ఉన్నట్టుగా గోబెల్స్‌ ప్రచారం చేస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ మంచిని కిందవరకు తీసుకెళ్లడం పార్టీకి ప్రధాన కర్తవ్యమన్నారు. 

ఇంతకు ముందే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని, గడప గడపకూ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి గడపకూ రెండు, మూడు సార్లు వెళ్లాలని, ప్రభుత్వం చేసిన మంచి చెప్పడంతో పాటు లోపాలను సరిద్దుకోవాలని సూచించారన్నారు. ఇదంతా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాచరణలో ఒకభాగమన్నారు. ఈ పార్టీ కార్యక్రమాలను జిల్లా, రీజనల్‌ కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తారన్నారు. ప్రతిపక్షం ఆరోపణలు తప్ప..వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలందరి పనితీరు బాగానే ఉందన్నారు. 

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది ఉద్యోగులు, కోట్లాది మందికి సర్వీస్‌ చేయాల్సిన చోట ఎక్కడో ఒక వ్యవస్థకు సంబంధం లేకుండా పొరపాటున చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని, అలాంటిదే ఒంగోలు జరిగిందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం అంటే ఫస్ట్‌ మార్కు సీఎం వైయస్‌ జగన్‌కే వస్తుందన్నారు. గతంలో ఇలాంటి జరిగినప్పుడు రియాక్షన్‌ లేనందువల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి గత ప్రభుత్వాన్ని రిజక్ట్‌ చేశారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం బాధ్యతగా రియాక్ట్‌ అవుతుంది.. స్పందిస్తుంది. మానవీయ కోణంలో ఆలోచన చేసి వ్యవస్థ మొత్తం కదులుతుందన్నారు.  

Back to Top