పక్కా పథకం ప్రకారమే అమలాపురంలో అల్లర్లు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

దాడుల వెనుక కొన్ని శక్తుల కుట్ర దాగి ఉంది

మా మంత్రి, ఎమ్మెల్యేపై మేమే దాడులు చేసుకుంటామా?

టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలు

దాడులకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు

చిల్లర రాజకీయాలతో నాయకులుగా ఎదగలేరు

దాడుల్లో పాల్గొన్న అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తి

పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

టీడీపీ ఆఫీస్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే పవన్‌ చదివినట్లుంది

చంద్రబాబు కూడా అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండు చేశారు

అంబేద్కర్‌ పేరు పెట్టాలని జనసేన వాళ్లు కూడా దీక్షలు చేశారు

అంబేద్కర్‌ పేరు విషయంలో టీడీపీ, జనసేన వైఖరి చెప్పాలి

అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు

మహిళల భద్రత కోసం దిశ యాప్‌ తీసుకొచ్చాం

ప్రజల అభిమానం చూరగొంటేనే అధికారంలోకి వస్తారు

కులం, మతాలను అడ్డుపెట్టుకుని మేం అధికారంలోకి రాలేదు

తాడేపల్లి: పక్కా పథకం ప్రకారమే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అల్లర్ల వెనుక కుట్రకోణం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. కొందరి ప్రవర్తనే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తుందన్నారు. అమలాపురంలో దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే వాళ్లే కథంతా నడిపించారనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. మా మంత్రి, ఎమ్మెల్యేపై మేమే దాడులు చేసుకుంటామా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టి పారేశారు. దాడులకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అమలాపురం అల్లర్ల విషయంలో ఒక్కోక్క రాజకీయ పక్షం అలాగే పార్టీలు, శక్తులు స్పందిస్తున్న తీరు చూస్తుంటే పథకం ప్రకారం ఎవరైతే కథ నడిపించారో వాళ్లే ఇలాంటి రియాక్షన్లు చూపిస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడుతున్న సమయానికి రాష్ట్ర మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి చేశారని మీడియా మిత్రులు చెప్పారు. ఇంత సడెన్‌గా ఎవరు చేసి ఉంటారని, ఏదైనా శక్తులు దీనిపై ఉంటారనే అనుమానం కలిగింది. అక్కడ జరిగిన పద్ధతి గమనిస్తే ఆ అనుమానం నిజమని స్పష్టమవుతోంది.  
జిల్లాల పునర్వీభజన తరువాత అందులో కోనసీమ జిల్లాగా ఉన్న జిల్లాను ఈ నెల 18వ తేదీ అంబేద్కర్‌–కోనసీమ జిల్లాగా నోటిఫికేషన్‌ విడుదల చేశాం. ఆ తరువాత దాని నిన్న పథకం ప్రకారం అల్లర్లకు పాల్పడ్డారు.

నిన్న ఆందోళనకారులు కలెక్టర్‌ వద్ద ధర్నా చేయడం, ఆ తరువాత పోలీసులపై దాడి, వెంటనే మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బస్సులు తగులబెట్టడం, ఆ తరువాత ఎమ్మెల్యే సతీష్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డి అక్కడ తగులబెట్టారు. దీనిపై రియాక్ట్‌ అయిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇంతకుముందే జనసేన అధ్యక్షుడు పవన్‌ స్పందిస్తూ..మేమే ఈ దాడులకు పాల్పడ్డామని గట్టిగా ఆరోపిస్తున్నారు. కొద్ది నిమిషాల తేడాలో తప్పించుకోకపోతే మంత్రి కుటుంబం, ఎమ్మెల్యే కుటుంబం సజీవ దహనం అయ్యేవారు. వీరికి దుర్మార్గపు ఆరోపణలే.

నిన్న ఫిజికల్‌గా చేశారు. ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా మా పార్టీ వాళ్లపైనే దాడి చేయించుకుంటామా? మా  ఇంటిపై మేమే తగులబెట్టుకుంటామా?. కమాన్‌సెన్స్‌ ఉన్నవారు ఎవరైనా ఇలాంటివి  ఒప్పుకుంటారా? మెడ మీద తల ఉన్నవారు ఎవరైనా  ఇలా చేస్తారా? ప్రజలు దీన్ని ఛీదరించుకోరా మీ మాట తీరును. ఇలాంటి ఆరోపణలు చేస్తే నిలబడుతుందా? అడ్డగోలు ఆరోపణలాగా ఉంటుందా? మన స్థాయికి ఇది సరిపోతుందా అన్నది ఆలోచన చేయలేరా? ఇలాంటి వాళ్లను ఇలాగే వదిలేస్తే..చంద్రబాబు కోరస్‌లాగా మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు, బీజేపీలోని చంద్రబాబు ఏజెంట్లు కోరస్‌లాగా ఇలాగే ఆరోపణలు చేస్తూ ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తారు.

వినే వారు ఏమనుకుంటారంటే..ఇందులో ఏదో ఉందని ఆలోచన చేస్తారు. ప్లాన్‌ చేసింది..చేయించింది..దాన్ని మళ్లీ మాపై రుద్దడం ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? మా లీడర్‌పై మేమే దాడి చేసుకుంటామా? అంబేడ్కర్‌ పేరు పెట్టిందే మా ప్రభుత్వం. అలాంటిది అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఏదైనా చేస్తామా?. అది కృత్రిమమైన దాడి అని ప్రతిపక్షాలే చెబుతున్నాయి. దాడులు చేసింది వాళ్లే అనడానికి ఫ్రూప్‌ ఉంది. ఇప్పుడు అరెస్టు అయిన వాళ్లు ఒక్కరుగా  బయటపడుతున్నారు. చంద్రబాబు కూడా ఆరోపణలు చేశాడు. నాతో కూడా ఫోటో దిగినట్లు చెబుతున్నారు. నేను కారు దిగుతుంటే అన్యం సాయి అనే వ్యక్తి ఫోటో దిగాడు. ఇదే వ్యక్తి చంద్రబాబు ఇంట్లో, జనసేన నేతల సమావేశంలో ఫోటో దిగాడు. జనసేన తరఫున పోటీ చేసిన వ్యక్తులు ఇందులో ఉన్నారని ఆరోపణలు ఉంటున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు దేనిమీద. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం తప్పు అని అయినా ఖండించండి. లేదా జరిగిన సంఘటనకు సంబంధించి వైయస్‌ఆర్‌సీపీ పై వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా? అందుకే మీపై మాకు అనుమానాలు ఉన్నాయి.

టీడీపీ, జనసేన ప్రోద్భలంతోనే కొన్ని అసాంఘిక శక్తులు అమలాపురం అల్లర్లలో పాల్గొన్నారు. దాడి చేసే వ్యక్తులకు ముందుగా అలర్టుగా ఉంటారు. అలాంటి చోట సడెన్‌గా వచ్చి తగులబెట్టారు. 200 మంది పెట్రోల్‌ క్యాన్లు తెచ్చుకున్నారట. ఇలాంటి దాడులు చేస్తారని ఎవరూ ఊహించలేదు. పైగా పోలీసులు ఎందుకు అలర్టుగా లేరని వీరు ప్రశ్నిస్తున్నారు. బస్సులు తగులబెట్టేంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ తరువాత పోలీసులు సంయమనంతో, నిగ్రహంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిగ్రహంతో వ్యవహరించారు. అదో దుస్సంఘటన. ఈ రోజు వాళ్లను అరెస్టు చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయి.

పవన్‌ కళ్యాణ్‌ ఇంతకు ముందు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెబుతున్నాను. మిగిలిన జిల్లాల కంటే కోనసీమ జిల్లాకు 30 రోజుల గడువు ఎందుకు ఇచ్చారని పవన్‌ ప్రశ్నించారు. ఈయనకు స్క్రిప్ట్‌ ఎవరు ఇస్తారో తెలియదు. నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు అన్నది జిల్లాల పునర్వీభజన చట్ట ప్రకారం  ఉంది. ఇది ఇంతకు ముందు కూడా 13 జిల్లాల నోటిఫికేషన్‌ సమయంలో కూడా ఇచ్చారు. మళ్లీ సవరించిన జిల్లాకు కూడా 30 రోజుల నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఈ నెల రోజుల గడువు ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చింది కాదు. పవన్‌ ఈ ఆరోపణలపై ఆలోచించాల్సి ఉంది. ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలి, స్క్రిప్ట్‌లో ఏముంటే దాన్ని చదువుతున్నాడు. అంబేద్కర్‌ పేరు కోనసీమకు ఎందుకు కడపకు పెట్టుకోకూడదని చిన్న పిల్లల మాదిరిగా సినిమా డైలాగులు చెప్పినట్లుగా ఉంది. దాని వల్ల గౌరవం పెరుగుతుందనుకుంటే ఆయనకు నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేదు.

ఈ నెలలో చంద్రబాబు కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ జిల్లాగా పెట్టాలని డిమాండు చేశారు. జిల్లాల పునర్వీభజన సమయంలో జనసేన పార్టీ నేతలే అంబేద్కర్‌ జిల్లాగా పేరు పెట్టాలని దీక్ష చేశారు. వాళ్లేందుకు కడప జిల్లాకు అంబేద్కర్‌ పెట్టమని కోరలేదు. ఇప్పుడెందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు చంద్రబాబు, జనసేన, ఇతరులు డిమాండు చేయడంతో అంబేద్కర్‌ పేరు పెట్టాం. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుతున్నారా? నిన్న జరిగిన దానిపై పవన్‌ అభిప్రాయం ఏంటోచెప్పాలి. ఈ గొడవ ఎందుకు జరిగిందనుకుంటున్నారు. భావోగ్వేగాలతో సహజసిద్ధంగా వచ్చిందనుకుంటున్నారా?.

అలాగైతే పెట్రోల్‌ క్యాన్లు ఎందుకు వచ్చాయి. అంబేద్కర్‌ పేరు పెట్టాలా? వద్దా? మీ స్టాండ్‌ ఏంటి? అంబేద్కర్‌ పేరు వద్దు అనుకుంటే అలాంటి వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?. అంబేద్కర్‌ మన దేశానికి చెందిన మహానుభావుడు. ఆయన ఒక కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని మీరు కూడా చెప్పాలి కదా?. గాంధీజీ, అంబేద్కర్‌ వీళ్లంతా ఒక కోవకు, జాతికి చెందిన వారని చెప్పాలి కదా?. స్ఫూర్తినిచ్చే మహానేతలు. మన భారతీయ ఆత్మ ఉంటే..అలాంటి నేతలు వీరు. అలాంటి వ్యక్తుల పేర్లు పెట్టినప్పుడు మీరు కూడా అవగాహన కల్పించాలి. 

ఇది కుట్ర పూరితంగా చేసినట్లుగా మేం ఫీలు అయ్యాం. కానీ మీకు మీరే భుజాలు తడుముకుంటున్నారు. దళితులు దూరమయ్యారని వాళ్లను దగ్గరకు చేర్చుకునేందుకు అంబేద్కర్‌ పేరుపెట్టారని పవన్‌ అంటున్నాడు. సబ్జెక్ట్‌ మరచి రాజకీయ విమర్శలు చేస్తున్నాడు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ గురించి పవన్‌ చదవిని స్క్రిప్ట్‌లో టీడీపీ హయాంలో ఏం చేశారో మీకు గుర్తు లేదా?. నిన్న జరిగిన అవాంఛనీయ సంఘటనను కంట్రోల్‌ చేశాం. అది రాజకీయ ప్రేరేపిత కార్యక్రమం. దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. రెండు నెలల నుంచి శ్రీలంక అంశాన్ని ఏపీకి ముడిపెట్టారు.

అక్కడ జరిగినట్లుగా ఇక్కడ ప్రజలు తిరుగబడుతారని మోకాలికి, బట్టతలకు ముడి పెట్టి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా అల్లర్లు జరుగుతున్నాయని చూపడానికి ఈ అల్లర్లు మొదలుపెట్టారా? తుని రైలు సంఘటన వెనుక మేమే ఉన్నామని ఆరోపణలు చేశారు. ఆ రోజు ఏదైన ప్రయోజనం పొందాలనుకుంటే అది చంద్రబాబుకే ఉంది. ఆ రోజు పవన్‌ ఏమనలేదు. అసాంఘిక శక్తుల కుట్ర అని పేర్కొన్నాడు. ఈ రోజు మాత్రం మాకు ముడిపెడుతున్నాడు. ఇళ్లు తగులబెట్టి దాంట్లో నుంచి ప్రయోజనాలు లాక్కోవాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు.

ఆయన తల నిండా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. మీ తోడళ్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర్లు మీ మనస్తత్వాన్ని ఆయన పుస్తకంలో ఆ రోజే రాశాడు. సమ్మె చేయలో బంద్‌ జరపాలంటే కనీసం రెండు బస్సులైన తగులబెట్టాలని ఆ రోజు చంద్రబాబు అన్నట్లు దగ్గుపాటి తన పుస్తకంలో పేర్కొన్నారు. పవన్‌ అలాంటి వ్యక్తి వద్ద ట్యూషన్‌ తీసుకుంటున్నాడు. చంద్రబాబు మార్గం వేరే. ఎవరో రెడీ చేసిన పార్టీని లాక్కోవడం, కబ్జా చేయడం చంద్రబాబు మనస్తత్వం. వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, అధికారం కోసం ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు. పవన్‌ ఎల్‌కేజీ నుంచి కూడా చంద్రబాబు వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నాడు. పవన్‌ మైండ్‌సెట్‌ను చంద్రబాబు ట్యూన్‌ చేస్తున్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడిందే ఇవాళ పవన్‌ మాట్లాడారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యాచారాలు, మహిళలపై దాడులకు సంబంధించి రికార్డులు ఉన్నాయి. మీకు కూడా ఆ రికార్డులు పంపిస్తాం.

ఇవాళ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక చిన్న చిన్న సంఘటనలు కూడా ఎల్లో మీడియాలో బ్యానర్‌ కథనాలు, టీడీపీ నుంచి ఒక స్టేట్‌మెంట్, పవన్‌ నుంచి మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చి విష ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ కులాలను వాడుకుని, కులాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి రాలేదు. వచ్చిన తరువాత మేం వ్యవహరించిన తీరు చూసినా రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు, అర్హత ఉన్న వారందరికీ లంచాలు, వివక్ష లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. చంద్రబాబు హయాంలో సొంత పార్టీని రక్షించుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు అలాంటి చర్యలు లేవు. నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి ఒక మహిళ పోలీసును ఏర్పాటు చేశాం. ప్రత్యేక వాహనాలు తెచ్చాం. అమరావతి పేరుతో చంద్రబాబు క్రియేట్‌ చేసిన డ్రీమ్‌ మేం చేయడం లేదు. లోపం ఎక్కడ ఉందో చెప్పండి. చంద్రబాబు ఏమంటే నేను కూడా అదే అంటానని, చంద్రబాబు బీ టీమ్‌లాగా ఉంటానని పవన్‌ అనడం సరికాదు. చంద్రబాబు ఆత్మ అనే, తమ్ముడు అనో ప్రజలు అనుకుంటున్నట్లుగా మీరు రుజువు చేసుకోవాలనుకుంటున్నారో అలాగే ఉండండి. లేదంటే వైయస్‌ జగన్‌ మాదిరిగా విశ్వసనీయ, నిబద్దతో పవన్‌ రాజకీయాలు చేయాలి.

వైయస్‌ జగన్‌ 2011లో పార్టీ పెట్టినప్పుటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తీరు, నిబద్ధత వైయస్‌ఆర్‌సీపీకి గీటురాళ్లు. పేదరికాన్ని నిర్మూలించడం ఎలా? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో నిజాయితీ, నిబద్ధత ఉంది. మీరు అభినందించమని కోరడం లేదు. ఇందులో ఎక్కడైనా ఒక కులం, పార్టీకే చే యాలనే ఆలోచన ఎక్కడైనా ఉందా?. అందుకే మేం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. మీరేమో ఆరోజుకు ఎలా పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంబేద్కర్‌ కుల నాయకుడు కాదు. పవన్‌ ఎస్సీ నాయకుడు అనుకుంటే ..జనసేన నాయకులు దీక్షలు ఎందుకు చేశారు. ఆయన మిత్రుడు చంద్రబాబు ఎందుకు డిమాండు చేశారు. రిపిటెడ్‌గా రావడంతోనే అంబేద్కర్‌ పేరు పెట్టాం. అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top