`గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం` పండుగ‌లా నిర్వ‌హించాలి

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: ``గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అవకాశంగా తీసుకోవాలని సూచించారు. సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోటుపాట్లు ఉంటే దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మ్యానిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు ప్రజలకు తెలియ‌జేయాల‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని మంత్రులు, జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. 

కాగా, మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు సందర్భించాలని ఆదేశించింది. ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రజలనుండి  సలహాలు, సూచనలు స్వీకరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. నియోజకవర్గంలో అన్ని ఇళ్లులు వెళ్లేంత వరకూ కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. 

Back to Top