తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేక ఈసీని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో రమేష్‌కుమార్ ఉండటానికి అనర్హుడు అన్నారు. టీటీపీ ఏజెంట్‌లా, లోపాయికారి వ్యక్తిలా నిమ్మగడ్డ వ్యవహరించారన్నారు. ఇలాంటి వ్యక్తి వెంటనే ఎన్నికల కమిషన్‌కు రాజీనామా చేయాలని డిమాండు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి ఈసీ రమేష్ కుమార్ లేఖ రాశారా అన్న అనుమానం వచ్చింది. రాయలేని భాషా, రాయకూడని భాషా అందులో ఉంది. ఎవరో ఆయన పేరుతో రాశారో అర్థమైంది. తొలి నుంచి డ్రామాలు, కుట్రలు, కుతంత్రాలు, స్టేజీ మానేజ్ చేసిన టీడీపీ, మీడియా హడావుడిని చూస్తే సంచలనం క్రియేట్ చేయాలని ప్రయత్నం. నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్, ఎన్నికల కోడ్ ఇన్నాళ్లు ఉండకూడదన్న సుప్రీం కోర్టు తీర్పు వల్ల వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన మద్దతును మళ్లించేందుకు ఇలా చేశారని అనుకున్నాం. విఫరీతమైన ఆరోపణలు చేస్తే ఆ బురద కడుక్కోవాడానికి రెండు రోజుల సమయం పడుతుందని అనుకున్నారు. దానికి తగినట్లే ఊతమిచ్చేలా రమేష్ కారు ఎక్కుతూ తాను రాయలేదని, అంత వరకు ఆ చానల్స్ ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. రాష్ట్రమంతా కూడా విష బీజాలు నాటారు. భయానక చిత్రం క్రియేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూశారు. రమేష్‌కుమార్ తనదే ఈ లేఖ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన ఈ లేఖ రాయడంలో రమేష్‌కుమార్ ఉద్దేశం ఏంటి? ఈ నెల 15వ తేదీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ లేఖలో భిన్నంగా రాశారు. ఒక వీధి స్థాయి చౌకబారు రాజకీయ నాయకుడు చేసినట్లు ఆ లేఖలో ఉన్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు రాసినట్లు లేదు. మతిస్థిమితం లేని వారు రాసినట్లుగా ఆ లేఖ ఉంది. అలాంటి పరిస్థితి లేదని ఈసీ 15వ తేదీ చెప్పిన దాంట్లోనే ఒప్పుకోలు ఉంది. ఆ రోజు ఏకగ్రీవాలన్నీ కూడా సర్టిఫై చేశారు. నిన్నటి లేఖలో హింసతో జరినట్లు చెప్పారు. చెదురుమదురు సంఘటనపై అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు రోజు వరకు ప్రభుత్వంతో సమన్వయంతో పని చేస్తున్నామని ఈసీ చెప్పారు. గ్రామస్థాయిలో బాధ్యత తీసుకోగలిగి పని చేయగలిగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలనుకున్న ప్రభుత్వ ఆశయంపై నీళ్లు చాల్లారు. దానికి సీఎంకు బాధాగా ఉంది. కరోనా వైరస్ వల్ల వచ్చే నష్టాలు, భయాలను సక్రమంగా ఎదుర్కోవాడానికి, వాలంటీర్ల వ్యవస్థకు తోడుగా ప్రజాప్రతినిధులు ఉంటే కరోనాను ఎదుర్కొనే వీలుంటుంది. దానిపై దెబ్బ కొట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్యపరంగా ఇంకొంచం ప్రమాదకరంగా ఉంచారు. దేశంలోనే మన రాష్ట్రంలో ఒక కోటి 30 లక్షల ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 8 వేల మందిని విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరికి స్థానిక సంస్థల ప్రతినిధులు తోడుగా ఉంటే బాగుండేది. ఆ రోజుకు, ఈ రోజుకు ఇంత సంధి ప్రేలాపణలోకి వెళ్లాల్సినంత 104 టెంపరేచర్ వచ్చే సంఘటనలు ఏం జరిగాయి. ఉన్నట్లు ఉండి ఆయన ఆలోచనలో ఏం మార్పులు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ ప్రభుత్వమైనా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తారు. పల్లెల్లో కక్షలు ఎక్కువగా ఉంటాయి. ఏకగ్రీవమైతే అందరూ కలిసి ఉంటారు. అందుకే ఏకగ్రీవమైన గ్రామాలకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. గతంలో కూడా ఏకగ్రీవాలు జరిగాయి. ఈ సారి ఎందుకు ఎక్కువగా జరిగాయి. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరంలో ఎమ్మెల్యే స్థానాలు స్వీప్ చేశాం. 2019 ఎన్నికల్లో 86 శాతం సీట్లు సాధించింది. పులివెందులలో టీడీపీ నాయకుడు సతీష్‌కుమార్ తన వల్ల కాదని తప్పుకున్నారు. చంద్రబాబే అస్త్రసన్యాసం చేశామని, రెండో తరం రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఖాళీ అయ్యింది. పోటీకి ఎవరూ రావడం లేదు. పైగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగుల పెడుతోంది. ఈ 9 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, రిజర్వేషన్లు, రైతులకు సంబంధించిన పథకాలు, అవినీతి రహిత పాలన, రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ పద్ధతి ఇలా ప్రతిదాంట్లో పారదర్శకత ఉండటంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. హామీలనే నమ్మిన ప్రజలు 50 శాతం ఓట్లు, 86 సీట్లను వైయస్ జగన్‌కు అప్పగించారు. ఇవన్నీ చూసిన తరువాత ఈ బిడ్డను ఇంకా ఆశీర్వదిద్దామని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసే అస్త్రసన్యాసం చేశారు. చెదరుమదరు సంఘటనలు జరుగుతాయి. టీడీపీ అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా?. పూర్తి బలహీనుడైతేనే బలవంతంగా ఏకగ్రీవం చేస్తాం. ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబు చెబుతున్న విషయాలు, ఆయన మాయ చిత్రం నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న అంశాలు రెండు కూడా సింక్ అవుతున్నాయి. చంద్రబాబే స్క్రిప్ట్ రాసుకుంటారు. తానే క్రియేట్ చేసుకుంటారు. దాన్ని చెప్పేందుకు నాలుగు టీవీ చానల్స్, పత్రికలు వెంట పెట్టుకుంటారు. రాష్ట్రంలో నిమ్మగడ్డ రాసిన మాటలు, పరిస్థితి ఉందా?. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి లేఖ రాయడం ఏంటి? రాస్తే..దాన్ని ఒప్పుకుంటున్నారా?. ఈ కన్య్ఫూజన్ ఎందుకు. దీని తరువాత అంకం ఏంటో తెలియదు. ఇది ఒక కుట్ర. వైయస్ జగన్‌ను, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము, శక్తి చంద్రబాబుకు లేదు. తాను సృష్టించుకున్న ఒక తోలు బొమ్మను పెట్టుకుని డ్రామాలాడుతున్నారు. రాజకీయంగా ఏదైనా పోరాటం చేయవచ్చు. ఎల్లోమీడియా వార్తలు చూస్తే..కరోనా వైరస్ కంటే పెద్దగా ఉన్నాయి. ధ్రువీకరించని వార్తను ఎలా రాస్తారు?. రమేష్‌కుమార్ లాంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడానికి అనర్హుడు. కుట్రపూరితంగా ఒక పార్టీ లోపాయికారి కార్యకర్తలాగా, ఏజెంట్ మాదిరిగా, అసహ్యంగా వ్యవహరించిన ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ పరిణామాలపై ప్రభుత్వం పరంగా, రాజకీయ పార్టీ పరంగా ఏం చేయాలో అది చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజల అభిమానం, ఆశీర్వాదం ఉంటేనే అధికారంలోకి వస్తారు. అది కాకుండా కాలు పట్టి లాగాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం కాదు. చంద్రబాబును నమ్మలేక ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా దళిత నేత వర్ల రామయ్యను నిలబెట్టారు. తన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకే రామయ్యను పోటీలో నిలబెట్టారు. చంద్రబాబు కింద బేస్ కదిలింది. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా కొద్ది రోజులు భరిస్తే చంద్రబాబు, టీడీపీ కనుమరుగు కావడం ఖాయం. ఈ ప్రభుత్వం, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా స్థిరంగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.