వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్‌..
 

నంద్యాల: నంద్యాల జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతల నాయకులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడుని హత్య చేశారు. కాగా, పోలీసులు కళ్ల ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం.

వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలోవైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు.

మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు.

Back to Top