జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. బలం లేకపోయినా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో 9 నామినేషన్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌ సీపీ స్టాండింగ్‌ కమిటీ అభ్యర్థికి అదనపు ఓట్లు పోలయ్యాయి. వైయస్‌ఆర్‌ సీపీ స్టాండింగ్‌ కమిటీ అభ్యర్థులు అప్పారి శ్రీదివ్య, ఇల్లపు వరలక్ష్మి, కోరుకొండ వెంకటరత్నస్వాతి, గుండపు వెంకటసాయి అనూష, జాజుల ప్రసన్న లక్ష్మి, పిండి వెంకట సురేష్, బర్కత్‌ అలీ, మాసిపోగు మేరీ జోన్స్, లొడగల అప్పారావు, సారిపల్లి గోవింద రాజుల వెంకట అప్పారావు విజయం సాధించారు. 
 

తాజా వీడియోలు

Back to Top