టీడీపీ, జనసేన కలిసొచ్చినా వైయస్‌ఆర్‌ సీపీని ఏమీ చేయలేవు

జీవో నంబర్‌.1ను తప్పుబట్టడం సిగ్గుచేటు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

రాజంపేట: తెలుగుదేశం, జనసేన పార్టీల సంబంధం 2014 నుంచీ కొనసాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వచ్చినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏమీ చేయలేవని, సీఎం వైయస్‌ జగన్‌ ప్రజాబలం ముందు ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోతాయన్నారు. రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్‌.. టీడీపీ పాలనలో ఎన్ని ఘోరాలు జరిగినా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి తట్టుకోలేక బాబు, పవన్‌ ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఉందని, ఏదో ఒక అభూత కల్పన సృష్టించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలు పవన్‌ కల్యాణ్‌ సినిమాలు చూసినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ మాత్రమేనన్నారు. జీవో నంబర్‌.1ను తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. మనుషులు చనిపోకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలీసుల సూచన మేరకు ఏదైనా గ్రౌండ్స్‌లో మీటింగ్‌లు పెట్టుకోవచ్చని జీవోలో స్పష్టంగా ఉందన్నారు. మీటింగ్‌లు పెట్టుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని సూచించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న ప్రతిపక్షాల డ్రామాలు తీవ్రమవుతాయని, వారి కుయుక్తులను ప్రజలంతా గమనించాలని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top