నామినేష‌న్లు వేసిన వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు 

అమ‌రావ‌తి: ఎమ్మెల్యే కోటాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున శాస‌న‌మండ‌లికి పోటీచేస్తున్న ఏడుగురు అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. తొలుత తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్‌, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బీ ఫారమ్స్‌ అందుకున్నారు. అనంతరం అసెంబ్లీ కార్యాలయంలో ఏడుగురు అభ్య‌ర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల వెంట పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి, నంబూరి శంకర్ రావు, ఉండవల్లి శ్రీదేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల‌ రఘురాం, జంగా కృష్ణమూర్తి ఉన్నారు. 

Back to Top