ఆరోప‌ణ‌లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

లోకేష్‌కు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ స‌వాల్‌

క‌ర్నూలు: త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు రుజువు చేయ‌క‌పోతే చంద్ర‌బాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీని మూసివేసి, రాజ‌కీయాల నంచి త‌ప్పుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ‌ఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. త‌న‌పై నారా లోకేష్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చించేందుకు " ఖుబ్ సురత్ మసీద్" లో  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సిద్ధ‌మ‌య్యారు. ముస్లింల పవిత్ర గ్రంథం "ఖురాన్ష‌ ను వెంట తెచ్చుకున్నారు. తాను ఒంటరిగా వస్తానని చెప్పి.. ఒక్క‌డినే వ‌చ్చాన‌ని, త‌న‌తో నారా లోకేష్ చర్చకు క‌చ్చితంగా రావాల‌ని డిమాండ్ చేశారు. నారా లోకేష్ త‌న‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి, నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమన్నారు. ఒకవేళ ఆరోపణలు నారా లోకేష్ రుజువు చేయకపోతే అబ్బా కొడుకులు టీడీపీని మూసేసి,  రాజకీయాల నుంచి తప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

Back to Top