రైతుల‌కు యూరియా అందించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఫైర్‌

తిరుప‌తి:  రైతుల‌కు స‌కాలంలో యూరియా అందించ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిప‌డ్డారు. రైతు సమ‌స్య‌ల‌పై ఈ నెల 9న ఆర్‌డీవో కార్యాల‌యం ఎదుట త‌ల‌పెట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంపై పార్టీ రైతు విభాగం నాయ‌కుల‌తో అభిన‌య్‌రెడ్డి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`చంద్రబాబు అధికారంలోకి రావడానికి అమ‌లువుకాని హామీలు ఇస్తారు. అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీలు గాలికొదిలేస్తారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసామంటారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. రైతు భ‌రోసాను అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చారు. రైతులకు రూ.40 ఇప్పటికి రావాలి, కానీ రూ.7 వేలు మాత్రమే ఇచ్చారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వైయ‌స్‌ జగన్ రైతుల స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తే త‌ప్ప ఈ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేదు. ప్ర‌స్తుతం రైతులు యురియా కొరత తో ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వ‌ద్ద క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. అధికార పార్టీ నాయ‌కులు యూరియాను బ్లాక్ మార్కెట్ లో విక్ర‌యిస్తున్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తీసుకురావాలి. వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు ఈ నెల 9న ఆర్డీవో కార్యాల‌యం ఎదుట త‌ల‌పెట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో రైతులు పాల్గొని విజ‌య‌వంతం చేయాలి` అని భూమ‌న అభిన‌య్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top