వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ వీరితో ప్రమాణం చేయిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తవుతుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్‌ నికోబార్‌ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. లోక్‌సభ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top