విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి

కనిగిరి సభలో వైయస్‌ విజయమ్మ

చంద్రబాబు పాలనంతా అన్యాయాలు, అక్రమాలే

హామీ నెరవేర్చే నాయకుడే రాజకీయాల్లోకి రావాలి

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో చదువులన్నీ ఉచితం

ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

జగన్‌ నాయకత్వంలో ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తారు

వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ

ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వైయస్‌ జగన్‌ ప్రజల మధ్యలోనే ఉన్నారు

4 నెలల క్రితం నా బిడ్డ వైయస్‌ జగన్‌ను చంపాలనుకున్నారు

 

ప్రకాశం: రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అక్రమాలు చూశామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో చదువులన్నీ కూడా ఉచితంగా చదివిస్తారని, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తారని తెలిపారు. మద్యాన్ని మూడు దఫాల్లో నిషేదిస్తారని విజయమ్మ వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం వైయస్‌ఆర్‌సీపీ పుట్టిందని ఆమె తెలిపారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ విజయమ్మ ప్రసంగించారు. ఆమె మాటల్లోనే..

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్‌ను అక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి హృదయపూర్వక నమస్కారాలు.కనిగిరి ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ ప్రసంగించారు.ఈ ఎన్నికలు ధర్మానికి,అధర్మానికి మ«ధ్య జరుగుతున్న ఎన్నికలు, అవకాశవాదానికి,మాటకు నిలబడే తత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు.విలువలకు,విశ్వసనీయతకు పట్టంకట్టాలి. ఒకసారి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుకుతెచ్చుకోవాలి. ఇది చేశాను అని చెప్పగలిగే సత్తా,సమర్థత చంద్రబాబుకు ఉందా..ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు ఉందా..రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ.ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వైయస్‌ఆర్‌సీపీ.మీకు,మాకు ఉన్న సంబంధం 40 సంవత్సరాల అనుబంధం.30 సంవత్సరాలుగా మీ భుస్కందాలపై మోసి సీఎంగా చేసుకున్నారు.ఆయన కూడా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.వైయస్‌ జగన్‌ మాట కోసం ఓదార్పు యాత్ర చేశారు.వైయస్‌ కుటుంబం ప్రజల పట్ల కృతజ్ఞత కలిగివుంటుంది.మీ రుణం తీర్చుకోలేదు.మా బిడ్డలను రక్షణకవచంలా కాపాడుకున్నారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం వైయస్‌ఆర్‌ మరణం తర్వాత మా కుటుంబం ఎదుర్కొన కష్టాల కంటే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు.వైయస్‌ జగన్‌ ప్రజల కోసం మొండిగా పోరాడుతున్నారు.ఓదార్పుయాత్రలో మీరు చూపిన ఆదరణ కాంగ్రెస్‌పార్టీ భరించలేకపోయింది.జగన్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం..రాజశేఖర్‌రెడ్డి మంచోడు..జగన్‌ మంచోడు..పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చెడ్డవాడు అయిపోయాడు.వైయస్‌ జగన్‌పై కుట్రలు చేసి జైలుకు పంపించారన్నారు.ఎన్నడూ జగన్‌ తన కష్టాలను మీ దగ్గర చెప్పుకోలేదు.మీ ఇబ్బందులను,కష్టాలను తెలుసుకున్నారు.ప్రత్యేకహోదా,సమైక్యాంధ్ర కోసం ఎన్నో పోరాటాలు చేశారు.వైయస్‌ఆర్‌ బతికున్న కాలంలో నేను ఏరోజు బయటకు అడుగుపెట్టింది లేదు.ఆ రోజు జగన్‌బయటకు వెళ్ళినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపిని గెలుపించుకోవడానికి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా మీ అభిమానంతోనే బయటకు వచ్చాను.20 సంవత్సరాల క్రితం మామ రాజారెడ్డిని హత్యచేశారు.

తొమ్మిదేళ్ల క్రితం రాజశేఖర్‌రెడ్డిని పొగొట్టుకున్నాం. అనుమాసద్పంగా ఆయన మరణించారు.నాలుగు నెలల క్రితం జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హతమార్చడానికి ప్రయత్నించారు.నాటకాలు,డ్రామాలు వేయడం నా కుమారుడికి రాదని,అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు.మరిది వైయస్‌ వివేకానందరెడ్డిని కిరాతంగా హత్యచేశారు.దీనిపై సీబీఐ విచారణ చేయించాలని అడగడం తప్పా..చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో జగన్‌ చేశారని మాట్లాడుతున్నారు.వైయస్‌ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు.బయటవారిని సైతం ప్రేమించే కుటుంబం వైయస్‌ కుటుంబం..హత్య చేసే కుటుంబం కాదు.మామ రాజారెడ్డిని చంపిన ప్రత్యర్థులు ఎదురుగా విచ్చలవిడిగా తిరుగుతున్న కూడా సీఎం స్థాయిలో ఉన్న వైయస్‌ఆర్‌ చట్టం తనపని తను చేసుకుని పోతుందని వదిలేశారు.కడప జిల్లాలో వైయస్‌ఆర్‌ రాజకీయాల్లోకి రానప్పుడు 40 ఫ్యాక్షన్‌  గ్రామాలు ఉన్నాయి.వారి మధ్య రాజారెడ్డి రాజీలు చేసి కలిపారన్నారు.చంద్రబాబుపై బాంబ్‌ దాడి జరిగినప్పుడు వైయస్‌ఆర్‌ చంద్రబాబు దగ్గర వెళ్ళి హత్తుకుని సానుభూతి తెలిపి ధర్నా చేశారని గుర్తుచేశారు.

పరిటాల రవి హత్యకేసులో జగనే చేయించార‌ని అసెంబ్లీలో చంద్రబాబు నానాయాగీ చేశారని..అప్పుడు వైయస్‌ఆర్‌ స్పందిస్తూ హత్య నా కుమారుడే చేసి ఉంటే ఉరితీయండి..సీబీఐ విచారణ చేయించారన్నారు.థర్డ్‌పార్టీ విచారణ వేయకుండా ఎందుకు మా కుటుంబంపై బురద చల్లుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా..తొమ్మిది సంవత్సరాల్లో మా కుటుంబం ఎంతో క్షోభ పడింది.ఎన్నో కుట్రలు,కుతంత్రాలు చేశారు. నాభర్త మరణం తర్వాత నా కుమారుడు జగన్‌ను జైల్లో పెట్టి దూరం చేశారు.కేవలం ఈ రోజు నిలబడి ఉన్నామంటే మీ అభిమానమే..జగన్‌ నిలబడి ఉన్నాడంటే కేవలం మీ ఆశీర్వాదమే..పాదయాత్ర సమయంలో జగన్‌పై హత్య జరిగిందని,నా బిడ్డను కాపాడుకోండని చెప్పానని, మీ ఆశీర్వాద  బలం,మీ ప్రార్థనలే ఆ రోజు నా బిడ్డను కాపాడయాన్నారు.వైయస్‌ఆర్‌ కులాలకు,మతాలకు,పార్టీలకు అతీతంగా సంక్షేమ పథఖాలు అందించారు.చంద్రబాబు ఇచ్చిన 650 వాగ్ధానాలు ఏమయ్యాయి.ఐదు మాఫీలు ఏమాయ్యయి.ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చారా.ప్రకాశం జిల్లా ఐదేళ్ల నుంచి కరువుతో అల్లాడుతుంది.చాలామంది వలసలు వెళ్ళారు. ఆత్మహత్యలు చేసుకున్నారు.రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్లోరైడ్‌ వాటర్‌తో కిడ్నివ్యాధులతో చాలామంది చనిపోయారు.

ఒక కనిగిరిలో 57 మంది మరణించారు.ప్రభుత్వం ఏనాడయినా స్పందించిందా..జగన్‌ ఈ జిల్లాలో ధర్నా చేసినతర్వాతే డయాలసిస్‌ సెంటర్లు వచ్చాయి.వైయస్‌ఆర్‌ బతికుంటే వెలుగొండ ప్రాజక్టు ఎన్నాడో పూర్తిఅయి ఉండేది.ఆయన హయాంలో 70శాతం పూర్తయింది.మిగిలింది పూర్తిచేయించడానికి చంద్రబాబుకు మనసు రాలేదు.తాగునీరు,సాగునీరుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పమ్మా అని జగన్‌ చెప్పారు.వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు.గుండ్లకమ్మ ప్రాజెక్టు 90శాతం పూర్తిఅయిన మిగిలింది పూర్తిచేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా చంద్రబాబుకు ప్రజలు గుర్తుకువస్తారు.రెండు సంవత్సరాల క్రితమే జగన్‌ నవరత్నాలను ప్రకటించారు.ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా, జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు.కనిగిరిలో అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది.నవరత్నాలను ఒకసారి ఆలోచించండి.వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారు.వైయస్‌ఆర్‌ ఉన్నపుడు వ్యవసాయానికి ఎంత భరోసా ఇచ్చారో అందరికి తెలుసు.రైతును రాజుగా చూడాలని, వ్యవసాయాన్ని పండగలా చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో గిట్టుబాటు ధర లభించింది.పసుపు,కందికి మద్దతు ధరల లభించడంలేదు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా జగన్‌ ప్రకటించారు.

వ్యవసాయానికి పగటిపూట తొమ్మిదిగంటల విద్యుత్‌ ఇస్తారు.రైతన్నలకు వడ్డీలేని రుణాలు,మే నెలలో పెట్టబడికి అవసరమైన ప్రతి సంవత్సరం 12,500 ఇస్తారు.రైతులకు ఉచిత బోర్లు,ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయి 50పైసాలకే విద్యుత్,ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌లు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు,సహకారి డైరీలకు పాలుపోస్తే 4 రూపాయలు బోనస్,ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్‌ రద్దు.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలకు నాలుగు వేల కోట్లు,రైతు చనిపోతే రైతు కుటుంబానికి రూ.7లక్షల రూపాయలు,అప్పులకు సంబంధం లేకుండా అసెంబ్లీలో చట్టం కూడా తీసుకోస్తారు.జలయజ్ఞం ద్వారా వైయస్‌ఆర్‌ మొదలుపెట్టి ప్రాజెక్టులు అన్నికూడా పూర్తిచేసి రైతులను ఆదుకుంటారు. 87 వేల కోట్ల రూపాయలు ఉన్న  రైతుల రుణమాఫీ చంద్రబాబు చేశాడా..

నేడు లక్ష 50వేల కోట్ల రూపాయిలకు వెళ్ళింది.కాని రుణమాపీ చేశానని చెబుతున్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు 14వేల కోట్ల రూపాయలు ఉన్న రుణమాఫీ నేడు 25వేల కోట్లకు వెళ్ళింది.రుణమాఫీ జరిగిందా అని అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నా.పసుపు–కుంకమ అయినా పూర్తిగా వచ్చిందా..జగన్‌ నాయకత్వంలో ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తారు.పిల్లలను బడికి పంపిస్తే ప్రతితల్లికి అమ్మబడి కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తాం.అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీలకే రుణాలు అందిస్తాం.45 ఏళ్లు నిండి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చేతిలో పెడతాం.పేదలకు పక్కా ఇళ్లు,అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తాం.ఎన్ని లక్షల ఖర్చుఅయినా జగన్‌ ఉన్నత చదువులు చదివిస్తాడు.హాస్టల్‌లో ఉండి చదువుకున్న విద్యార్థులకు రూ.20వేలు ఇస్తాం.రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాం.హైదరాబాద్,బెంగుళూరు,చెన్నై సహా ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తాం..

 

Back to Top