సంక్షేమ రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ రావాలి..

చంద్రబాబుకు సూటివ్వని పదం పౌరుషం

దోచుకోవడమే చంద్రబాబు చేసిన అభివృద్ధి..

అన్ని రంగాల్లో చంద్రబాబు విఫలం

మోసగాడిని నిలదీయండి..

విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టండి..

విజయవాడ వెస్ట్‌ ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ షర్మిల

విజయవాడ:అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల పిలుపునిచ్చారు.విజయవాడ వెస్ట్‌ ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉందా.ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పల పాలు అవుతున్నారని చదువులు కూడా మానేస్తున్నారు.వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశాడు.పేదలను కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళొద్దు..ప్రభుత్వం ఆసుప్రతికి వెళమని చంద్రబాబు శాసిస్తున్నాడు.చంద్రబాబు,ఆయన కుటుంబసభ్యులకు జబ్బులొస్తే ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్తారా..కార్పొరేట్‌ ఆసుప్రతికి వెళ్తారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.నిజంగా చంద్రబాబుకు మాట నిలబడే నైజం ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేది.రాజధాని అమరావతిని నేను మాత్రమే  కట్టగలని ప్రచారం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక పర్మినెంట్‌ బిల్డింగ్,ప్లైఓవర్‌ కూడా కట్టలేదు.రాజధాని కోసం కేంద్రం 2,500 కోట్లు చంద్రబాబుకు ఇచ్చింది..ఆ డబ్బుంతా ఏమైపోయింది. చంద్రబాబు కడుపులో ఉంది.అమ్మకు అన్నం పెట్టడు గాని పినమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడంట ఒకడు..హైదరాబాద్‌లో చంద్రబాబు పెద్ద ఇళ్లు కట్టుకున్నాడు.

ముఖ్యమంత్రిగా రాజధానిలో ఒక పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు. మరో ఐదేళ్లు మళ్లీ అధికారం ఇస్తే..అమరావతిని అమెరికా చేస్తాడంట.శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తాడంట..మన చెవుల్లో పువ్వులు,క్యాబేజీలు పెడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ఎవరికి వచ్చింది..చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది.ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు. లోకేష్‌కు  జయంతికి,వర్ధంతికి తేడా కూడా తెలియదు. లోకేష్‌ ఒక ఎన్నిక కూడా గెలవలేదు.ఏ అనుభవం, అర్హత లేని లోకేష్‌కు మూడు శాఖలకు మంత్రిని చేశాడు.చంద్రబాబు కొడుకుకి మూడు ఉద్యోగాలంట. సామాన్య ప్రజలకు  ఒక ఉద్యోగం కూడా లేదు.నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి చాలా అవసరం. ప్రత్యేకహోదాను చంద్రబాబు నీరుగార్చారు.నాలుగేళ్లు బీజేపీతో చంద్రబాబు సంసారం చేసి కూడా ప్రత్యేకహోదాను సాధించలేకపోయారు.ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి అవసరమా..గత ఎన్నికల్లో 10 ఏళ్లు కాదు..15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలన్నాడు చంద్రబాబు..ఎన్నికలు అయిపోయాక మాట మర్చాడు.

కమీషన్లు కోసం ప్రత్యేకహోదా వద్దు.. ప్యాకేజీ అన్నాడు..మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ప్రత్యేకహోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏం అంటాడో చంద్రబాబుకు కూడా తెలియదు.చంద్రబాబు ఒక మాటపై నిలబడడు.గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అన్నాడు. వైయస్‌ జగన్‌కు ఎవరితోనూ పొత్తులు లేవు. సింహం సింగిల్‌గానే వస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. చంద్రబాబు పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు.ఆయనకు అసలు సూటి అవ్వని పదం పౌరుషం.సొంతమామను కూడా వెన్నుపోటు పోడిచింది చంద్రబాబు.ఎన్టీఆర్‌ నుంచిపార్టీని కూడా లాక్కేసుకున్నాడు.ఈయన పౌరుషం గురించి మాట్లాడేది. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోయిందా.. పిల్లి పిల్లే..పులి..పులే..వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట కోసం సోనియాగాం«ధీ అంతటి వ్యక్తిని ఎదురించి సింగిల్‌గా బయటకు వచ్చారు.అది పౌరుషమంటే..అది రోషమంటే..  .టీడీపీ వాళ్లు ఓట్లు కోసం వస్తే చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి అడగండి..మీకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిహామీకి సంబంధించి రావాల్సిన బాకీని చెల్లించమని నిలదీయాలి.రాష్ట్రంలో దోచుకున్న మీ భూములను రాసి ఇవ్వమని చెప్పండి.

ఒకవైపు వెన్నుపోటు పోడిచిన, ప్రత్యేకహోదా, రాజధాని విషయంలో విఫలమయిన, వ్యవసాయాన్ని తగ్గించిన అవినీతికి పాల్పడిన చంద్రబాబు ఉన్నారు. మరోవైపు  విలువలకు,విశ్వసనీయతకు కట్టుబడిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. చంద్రబాబులాగా రాజకీయ వ్యభిచారం చేయలేదు. ప్రజల తరపున నిలబడి వారి కష్టాలు కోసం పోరాటం చేశారు. పాదయాత్ర చేసి కోట్ల మంది ప్రజలను కలుసుకున్నారు.మంచికి,చెడుకు జరుగుతున్న యుద్ధం. మంచివైపు నిలబడమని అడుగుతున్నా..ప్యాన్‌గుర్తుకే ఓటు వేసి గొప్ప మెజార్టీతో గెలిపించాలి. వైయస్‌ జగన్‌ సారథ్యంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.డ్వాక్రా మహిళలకు ఎంతయితే రుణం అయితే మొత్తం మాఫీ చేసి మీ చేతిల్లో పెడతారు.ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా విద్యార్థులకు  ఉచితంగా చదివిస్తారు.

సంవత్సరానికి 20వేలు రూపాయలు హాస్టల్,మెస్‌ చార్జీలకు పెడతాం.  1000 రూపాయలు వైద్యం ఖర్చు దాటితే  ఆరోగ్యశ్రీకి వర్తింపు చేస్తాం.సంవత్సరానికి  5లక్షల లోపు జీతం ఉన్న వారికి యూనివర్శల్‌ కార్డులు ఇచ్చి ఆరోగ్యశ్రీకి వర్తింపచేస్తాం.అమ్మ ఒడి ద్వారా తమ పిల్లలను స్కూల్‌కు పంపితే సంవత్సరానికి 15వేలు ఇస్తాం.ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళలకు 75వేలు ఆర్థికసాయం చేస్తాం.ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగులకు  ప్రాధాన్యత ఇస్తాం.వారి ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం.వృద్ధులకు పెన్షన్‌ 3వేలు నుంచి క్రమంగా పెంచుకుంటూ పోతాం. ప్రతి పేదవాడికి పక్కాఇళ్లు  ఉండాలంటే వైయస్‌ జగన్‌ముఖ్యమంత్రి కావాలి.అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. ఓటు వేసే ముందుఒకసారి గుండెల్లో వైయస్‌ఆర్‌ను తలుచుకోండి. అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి వైయస్‌ఆర్‌సీపీని గెలిపించండి 

Back to Top