బాబు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరు

తణుకు సభలో వైయస్‌ షర్మిల

మోసానికి మారుపేరు చంద్రబాబు

చంద్రబాబు ఎప్పుడైనా ప్రభుత్వ ఆసుపత్రికివెళ్లారా?

 మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానని బాబు వాగ్ధానం చేశారు.

రాజధానిలో ఒక్క ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా?

 అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తారట

  బాబు వస్తే జాబు వస్తుందన్నారు..ఎవరికైనా వచ్చిందా?

 

 

పశ్చిమ గోదావరి: చంద్రబాబు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయని టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తున్నారని,  మీ బాకీ తీర్చాలని నిలదీయండి అని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్లే అని చెప్పారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ షర్మిల ప్రసంగించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్లు పరిపాలించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించారు. మోసానికి చంద్రబాబు మారు పేరు అని విమర్శించారు. పోలవరం అంచనాలు రూ.60 వేల కోట్లకు పెంచి దోచుకున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

బాబుది పుత్ర వాత్సల్యం కాదా?
పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ..తెలుగు రాదు..కనీసం జయంతి, వర్ధంతికి తేడా తెలియదు. అ, ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం తనకే అన్నారట. ఒక్క ఎన్నిక కూడా ఈ పప్పు గెలవలేదు. ఏ అర్హత, అనుభవం ఉందని మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్రవాత్సల్యం కాదా?

హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నారు..
ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అయినా ఘోరంగా విఫలమయ్యారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నారు. గెలిచాక హోదా వద్దు..ప్యాకేజీ కావాలన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి హోదా అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. చంద్రబాబు తనకు రెండు నాలుకలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ హోదా కోసం ఉద్యమించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. జగన్‌ పోరాటం చేయకపోతే చంద్రబాబు ఈ రోజు హŸదా కోసం యూటర్న్‌ తీసుకునేవారు కాదు. నాన్న చెప్పేవారు. చంద్రబాబు తన నెత్తిమీద శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు నిజం చెబితే ఆయన తల వెయ్యిముక్కలు అవుతుందట. అందుకే ఏ రోజు కూడా ఆయన నిజాలు చెప్పరు. 

నక్కలే గుంపులుగా వస్తాయి..
నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. ఇప్పుడేమో మాకు బీజేపీతో పొత్తు అంటున్నారు. చివరకు హరికృష్ణ మృతదేహం పక్కనే చంద్రబాబు కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడారు. మాకు ఏ పొత్తులు లేవు. పొత్తుల అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగన్‌ సింగిల్‌గానే వస్తుంది. బంపర్‌ మెజారిటీతోనే గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు అరవింద్‌ కేజ్రివాల్, మమతా బెనర్జీ, ఫరూక్‌ అబ్ధుల్లా వంటి నేతలను వెంటపెట్టుకొని తిరుగుతున్నారు. సింహం సింగిల్‌గా వస్తుంది..నక్కలే గుంపులుగా వస్తాయి.

బాకీ సంగతి ఏంటని నిలదీయండి
ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ నాయకులు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలో తెలుసా? ముందు వారికి కూర్చోబెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు..ఇన్నాళ్లు మేం కట్టిన స్కూల్‌ ఫీజులు బాకీ పడ్డారని చెప్పండి. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు ఇస్తామని చంద్రబాబు వాగ్ధానం చేశారు. ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు రూ.25 బాకీ పడ్డారు. ఆ డబ్బు సంగతి ఏంటని ప్రశ్నించండి. కాలేజీ పిల్లలకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్టు ఫోన్లు ఇస్తామన్నారు. ఎన్నికలలోపు అవన్నీ కూడా ఇవ్వమని మీ హక్కుగానే అడగండి. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు అన్నారు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ప్రతి ఇంటికి చంద్రబాబు బాకీ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఓటు అడిగితే ఆ బాకీ సంగతి ఏంటని అడగండి. ప్రతిపేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. ఇళ్లు అన్నారు. టీడీపీ నేతలు వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ స్థలమంతా మీదే. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. మీ ఓటు అమ్ముతారా? డబ్బులిస్తామంటారు. మనం అమ్ముడపోతామా? చంద్రబాబు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరు. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు..నా బాధ్యతఅని చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ ఐదేళ్లు సీఎంగా ఉండింది ఆయనే కదా? లోకేష్‌ కు మాత్రమే ఆయన భరోసా ఇచ్చారని, మనల్ని పట్టించుకోలేదు. పొరపాటున కూడా టీడీపీకి ఓటు వేస్తే మన భవిష్యత్తును నాశనం చేస్తారు. ఈ నారారూప రాక్షసులను నమ్మకండి. 

జగనన్న రావాలి..
ఈ అవినీతి పాలన పోవాలంటే జగనన్న రావాలి. పది తలల రావణాసురుడు పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చినవాడు పోవాలంటే జగనన్న రావాలి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. మాట ఇచ్చిన వాడు..మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు..చెప్పనిది కూడా చేసేవాడు రావాలంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రతి రైతుకు రూ.12500 ప్రతి ఏటా ఇస్తారు. రైతు రాజు కావాలంటే రాజన్న రాజ్యం రావాలి. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసి నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. విద్యార్థులు ఏ కోర్సు చదివినా..ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి విద్యార్థికి హాస్టల్‌ ఖర్చులకు రూ.20 వేలు చెల్లిస్తాం. వైద్యం కోసం ఏ ఆసుపత్రికి వెళ్లినా బిల్లు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం. మీ పిల్లలను కూలీకి తీసుకెళ్లకుండా స్కూల్‌కు పంపితే చాలు రూ.15 వేలు ప్రతి ఏటా చెల్లిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. పింఛన్లు రూ.3 వేలకు పెంచుతాం. వ్యవసాయం పండుగ రావాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి.
11వ తేదీ ఎన్నికలు ఉన్నాయి..ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. జగన్‌ను ఆశీర్వదిస్తూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజాతీర్పు కావాలి..బైబై బాబు ..బాబును, పప్పును ఇంటికి పంపేద్దాం. ఫ్యాన్‌ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. రాజన్న రాజ్యానికి వేసినట్లే. ఫ్యాన్‌ గుర్తుకే మీ ఓటు..

 

Back to Top