పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవం సంద‌ర్భంగా వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్టు చేశారు.

బాల్యం.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ తిరిగిరాని, మ‌రిచిపోలేని మధుర జ్ఞాప‌కం. బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం. వాళ్లే రేప‌టి భావి భార‌త ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ  తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Back to Top