నేటి వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్ 

నాలుగు జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ ఎన్నికల ప్రచారం 
 

 హైదరాబాద్‌:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లా ఎస్‌.కోట, 11.30 గంటలకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి, మధ్యాహ్నం 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

పాలకొండ, రాజాం, పాతపట్నంల్లో వైయ‌స్‌ విజయమ్మ సభలు
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, రాజాం, పాతపట్నం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆమె సభల్లోనూ, రోడ్‌షోలలోనూ పాల్గొంటారు. 

పొన్నూరు, తెనాలి, పెనమలూరుల్లో షర్మిల ప్రచారం
ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, తెనాలి, కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి  వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. రోడ్‌షో, బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. 

 

Back to Top