వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది

త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేపల్లి : నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయ‌స్ఆర్ సీపీ కుటుంబ స‌భ్యుల రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేనిద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..
అలాగే ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.
నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న  వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబ స‌భ్యుల రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేనిది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top