దుర్మార్గపు పాలనపై చర్చ జరగాలి 

పోల‌వ‌రం పునాదులు దాటడం లేదు

రాజ‌ధాని పేరుతో సినిమా

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాలకు తూట్లు పొడిచారు.

తి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు చంద్ర‌బాబు

కాకికాడ‌: చ‌ంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తి గ్రామంలో..ప్రతి ఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. కాకినాడ స‌మ‌ర శంఖారావంలో బూత్ క‌మిటీ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశా నిర్దేశం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ..పక్కన పోలవరం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు పునాధి గోడలు దాటి ముందుకు కదల్లేదు. అటువైపున రాజధాని కనిపిస్తుంది 50 వేల భూములు సేకరించారు అడ్డగోలుగా. సేకరించిన ఆ భూమిలో గడ్డి, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. రాజధాని గారడీ కనిపిస్తుంది చంద్రబాబు నైజంలో. పూర్తికాక ముందే పోలవరం ప్రాజెక్టు చూస్తే, తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, ఆ భవనాల్లోకి వెళ్లే రోడ్లను చూపిస్తే బీటలు కనిపిస్తాయి. పోలవరం పునాధి గోడలు దాటి ముందుకు కదలడం లేదు. ఆ పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి. రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వతం అనేది ఏదీ కనిపించదు. ఆ తాత్కాలిక భవనాల్లో బయట 3 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి. ఏ ఒక్కటీ కూడా వదలకుండా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు పాలనపై చర్చ జరగాలి. 

మమతలు లేవు. మానవత్వం లేదు. వీటన్నింటికీ చంద్రబాబుకు అర్థం కూడా తెలియదు. ఎన్టీఆర్‌ శవం మీద రాజకీయం చేయగలుగుతాడు. హరికృష్ణ శవం పక్కనబెట్టుకొని రాజకీయం చేశాడు. ఇలాంటి మనిషి రాజకీయాల్లో అవసరమా అన్న అంశంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఇక ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందన్న వారం ముందు ఆయనకు కావాల్సిన ఆయన బినామీలకు భూములు కేటాయింపులు చేసి రాయితీలు ఇస్తాడు. నోటిఫికేషన్‌ వారం రోజుల ముందు కూడా కేబినెట్‌ మీటింగ్‌లు జరిగితే మనకు వినిపించే ఎవరికి ఏ రాయితీలు ఇవ్వాలి, ఎవరికి ఎంత భూములు కేటాయించాలి. దాంట్లో ఎంత లంచాలు గుంజాలనేవి కనిపిస్తున్నాయి. చంద్రబాబు కేబినెట్‌ మీటింగ్‌లలో, వీటిపై ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని చేస్తున్న దుర్మార్గపు పాలనపై చర్చ జరగాలి. 

పిల్లల చదువులకు ఆశా కిరణం ఫీజురియంబర్స్‌మెంట్, పిల్లలు చదవాలి. పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, ఎంబీఏ, ఎంసీఏ చదవాలి. ఈ రోజు అటువంటి ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం పరిస్థితిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మన పిల్లలు పెద్ద చదువులు చదివించే పరిస్థితి ఉందా..? ఇప్పుడున్న ఫీజురీయింబ‌ర్స్ మెంట్‌ పథకంపై చర్చ జరగాలి. ఆరోగ్యశ్రీపై చర్చ జరగాలి. ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్న వైనంపై చర్చ జరగాలి. ఇవాళ ఎవరికైనా ఆపరేషన్‌ అవసరం అయితే అప్పులపాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్నామా.. 108కి ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌.. కుయ్‌ అంటూ మనకు మేలు చేయడానికి అంబులెన్స్‌ మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉందా అనే అంశాలపై చర్చ జరగాలి. ఇవాళ అంగళ్లలో కూడా మద్యం అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మొదటి సంతకం బెల్ట్‌షాపులు రద్దు అని చేశాడు. ఆ మోసంపై చర్చ జరగాలి. మన గ్రామాల్లో ఆడవాళ్లు రాత్రి 7 దాటితే తిరిగే పరిస్థితి ఉందా..అనే అంశంపై చర్చ జరగాలి. వీటన్నింటిపై చర్చ జరిపించే కార్యక్రమం చేయాలి. ఈవీఎంలపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈవీఎంలను దొంగతనం చేసి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్నారు. వేల కోట్ల రూపాయలు కుమ్మరించి ఉన్న ఓట్లను తొలగిస్తున్నాడు. లేని ఓట్లను చేర్పించే కార్యక్రమం చేస్తాడు. ఏ ఒక్కరైనా చంద్రబాబు పాలనలో స్వచ్ఛందంగా బూతుల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉందా అనే అంశంపై చర్చ జరగాలి. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ అవినీతి పరుడు, ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన నేరగాడు. చివరకు తనకు ఓట్లు వేయరనుకుంటే ప్రజల ఓట్లను తీయించే నంబర్‌ వన్‌ క్రిమినల్‌. ఇటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి వ్యక్తిని కొన్ని టీవీలు, కొన్ని పత్రికలు నెత్తినపెట్టుకొని మోస్తున్నాయి. ఇటువంటి పచ్చ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇంకా మిగిలిన పచ్చ ఛానళ్లు చంద్రబాబును భుజాన వేసుకొని మోస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top