వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం 

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైయ‌స్‌ జగన్‌ తన సొంత జిల్లా అయిన వైయ‌స్ఆర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం, అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సహా బెంగళూరుకు వెళ్లారు.  కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం వైయ‌స్‌ జగన్ ఇవాళ‌ తాడేపల్లికి వ‌చ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగ‌తం ప‌లికారు.

Back to Top