తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైయస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.