అల్లూరికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు.. బ్రిటీష్ పాల‌కుల‌కు ఎదురొడ్డి నిలబడిన విప్ల‌వ‌ వీరుడు. ఆదివాసీల హ‌క్కుల కోసం పోరాడిన నాయ‌కుడు మ‌న అల్లూరి సీతారామ‌రాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు ఆల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాలులర్పిస్తున్నా`` అని ట్వీట్ చేశారు.

Back to Top