కచ్చితంగా నవరత్నాలు తీసుకువస్తా 

మదనపల్లి సభలో వైయస్‌ జగన్‌

గిట్టుబాటు ధర లేక టమోటాలు రోడ్డుమీద పడేసిన వైనం చూశా

సిల్క్‌ సబ్సిడీ పేరుతో చేనేత కార్మికులను చంద్రబాబు మోసం చేశారు

హెరిటేజ్‌ కోసం దళారీలకు చంద్రబాబే కెప్టెన్‌ అయ్యారు

మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పంటలకు గిట్టుబాటు ధర

రైతన్నలకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12500

అవ్వాతాతలకు నెలకు రూ.3 వేల పింఛన్‌

45 ఏళ్లు నిండిన మహిళలకు వైయస్‌ఆర్‌ చేయూత కింద రూ.75 వేలు

 

 చిత్తూరు: నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా నవరత్నాలు తీసుకువస్తానని, మీ అందరికి మంచి చేస్తానని ఆయన మాటిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చే రూ.3 వేల డబ్బుకు మోసపోవద్దని..20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరికి చెప్పాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

మదనపల్లి మీదుగా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘంగా సాగింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఇదే మదనపల్లి నియోజకవర్గంలో దేశంలోకెల్లా రెండో అతిపెద్ద మార్కెట్‌ ఇక్కడ ఉంది. టమాటల మార్కెట్‌ ఇక్కడ ఉంది. మదనపల్లిలో గిట్టుబాటు ధర లేక టమాట రైతులు రోడ్డుపై పారవేసిన దుస్థితి చూశాను. కష్టాలు పడుతున్న రైతుల ఆవేదనను చూశాను. కిలో రూపాయికి టమాటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతన్నలు నాతో అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సి ఉండగా మార్కెట్‌ పేరుతో పది శాతం వసూలు చేస్తున్నారని రైతులు చెప్పిన మాటలు గుర్తున్నాయి. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌ కోసం దళారీలకు తానే నాయకుడయ్యారు. ఇదే నియోజకవర్గంలోనే పాలబాటిల్‌ తీసుకొని వచ్చి అన్నా..ఒక్క లీటర్‌ మినరల్‌ వాటర్‌ ధర..లీటర్‌ పాలకు ఇస్తున్నారని చెప్పారు. హెరిటేజ్‌ లాభం కోసం ఏ రకంగా చిత్తూరు డయిరీని సమాది చేశారో ఇక్కడి రైతులు చెప్పిన సంగతి మరిచిపోలేదు. 

ఇదే ప్రాంతంలో చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాం. చేనేతలకు గుర్తింపుకార్డులు లేవు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది చెప్పారు. చేనేతలను ఏరకంగా మోసం చేశారో చెప్పారు. 35 వేల చేనేత కుటుంబాలను కుదించి కేవలం 3 వేల మందికి మాత్రమే పరిహారం ఇస్తున్నారు. ప్రతి చేనేత సోదరుడికి ఆరోజే చెప్పాను. దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకుంటానని ఆరోజే చెప్పాను.  మున్సిపాలిటీలో ఇంటి పన్ను ఏడాదికి రూ.7 వేలు లాగుతున్నారన్న మాటలు గుర్తున్నాయి. 
– ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. చ ంద్రబాబు ప్లాట్ల పేరుతో ఎలా మోసం చేస్తున్నారో ఆ రోజు చెప్పాను. 300 అడుగుల ప్లాట్‌ను అడుగుకు రూ.2 వేల చొప్పన రూ.6 లక్షలకు అమ్ముతున్న పరిస్థితిని చెప్పాను. లంచాలు తీసుకునేది చంద్రబాబు..పేదలు 25 ఏళ్లు నెల నెల రూ.3 వేలు కడుతూ...పోవాలట. ఇదేక్కడి ధర్మం. ప్రతి పేదవాడికి ఇవాళ చెబుతున్నాను. ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు ప్లాట్లు ఇస్తే ఎవరూ వద్దనకండి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ పేరుపై అప్పుగా రాసుకున్నారో ఆ డబ్బంతా రూ.3 లక్షలు మాఫీ చేస్తానని ఆ రోజే చెప్పాను. 
– మైనారిటీ సోదరులకు షాదీఖానా లేదని చెప్పిన మాటలు గుర్తున్నాయి. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు హంద్రీనీవా పేరుతో చేస్తున్న డ్రామాను ప్రజలు చెప్పారు. నాన్నగారు పూర్తి చేసిన కాల్వల్లో రెండు చెంబుల నీరు పోసి తానే కడుతున్నట్లు బిల్డప్‌లు కొడుతున్నారు. 40 శాతం పూరై్తనా ప్రాజెక్టును చంద్రబాబు లంచాలమయం చేశారు.  ఇవన్నీ కూడా విన్నాను. 
– రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో విన్నాను. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ పేద కుటుంబానికి నేను చెబుతున్నాను. మీ కష్టాలన్నీ నేను విన్నాను. మీ బాధలు నేను చూశాను. మీ అందరికి ఇవాళ భరోసా ఇస్తున్నాను. నేనున్నాను..
– ఫీజు రీయిబర్స్‌మెంట్లు రాక..ఇంజినీరింగ్‌ చదవాలంటే ఏడాదికి లక్ష రూపాయల ఫీజు కట్టాలంటే..ప్రభుత్వం అరకొరగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంటే..అన్నా..మా చదువులు ఎలా ముందుకు సాగాలని పిల్లలు చెప్పిన మాటలు విన్నాను. చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి చూశాను. మీ బాధలు నేను చూశాను. నేనున్నానని మీ అందరికి మాటిస్తున్నాను.
– 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ రాక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధలు విన్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి అవస్థలు చూశాను. ఆదుకోలేని ప్రభుత్వాన్ని చూశాను. వైద్యం కోసం మీరు పడుతున్న బాధలు నేను చూశాను. మీ కష్టాన్ని నేను విన్నాను. మీ బాధలు చూశాను. మీ అందరికి నేనున్నానని కచ్చితంగా భరోసా ఇస్తూ చెబుతున్నాను. 
–మద్యం షాపులు ఎక్కువై..మద్యానికి బానిసై కుటుంబాలు నాశనమవుతున్న కుటుంబాలు చూశాను. గ్రామాల్లో మూడునాలుగు బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. ప్రతి కిరాణం షాపులో మందు దొరుకుతోంది. ఏడు దాటితే మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి చూశాను. మీ బాధలు విన్నాను. మీ కష్టాలు చూశానని ప్రతి అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నాను.
– మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాక..ప్రత్యేక హోదా వస్తుందని ఎదురుచూశారు. హోదాను మన కళ్లెదుటే తూట్లు పొడిచిన పరిస్థితిని చూశాను. ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన పిల్లలు కోచింగ్‌లకు వేలకు వేలు ఖర్చు చేసిన వారి కష్టాలు చూశాను. పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తున్న పిల్లలను చూశాను. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు మాటిచ్చారు. ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. ఆ ప్రతి పిల్లాడికి ఇవాళ నేను చెబుతున్నాను. మీ అందరికి నేనున్నానని హామీ ఇస్తున్నాను.
–చదువుల కోసం..పిల్లలను చదివించేందుకు ఆ తల్లులు కూలీలకు వెళ్తు ఆరాటపడుతున్న పరిస్థితులు చూశాను. ప్రతి కష్టం చూశాను. కచ్చితంగా నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను.
– ఐదేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను చూశాం. చంద్రబాబును మన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏంటంటే అబద్ధాలు, మోసాలు, కుట్రలే కనిపిస్తున్నాయి. ఎన్నికలు మరో 20 రోజుల్లో రాబోతున్నాయి. చంద్రబాబు ఈ మధ్య కాలంలో చేయని మోసం లేదు. చెప్పని అబద్ధం లేదు. కుట్రలు అంతా ఇంతా కాదు. మన ఊర్లకు చంద్రబాబు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ  రూ.3 వేలు డబ్బులు పెడతారు. ఎన్నికల నాడు చంద్రబాబు డబ్బులతో వచ్చినప్పుడు మీరంతా కూడా ప్రతి ఒక్కరిని కలవండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా..అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి.
–  మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్న సీఎం అయ్యాక మన పిల్లలను అన్న చదవిస్తాడని చెప్పండి. 
– పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు అక్కా అని చెప్పండి. ఐదేళ్లుగా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు మాఫీ చేయలేదని చెప్పండి. అక్కా..గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. చంద్రబాబు సీఎం అయ్యాక సున్నావడ్డీలు ఎగురగొట్టారని చెప్పండి. 20 రోజులు ఓపికపడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న సీఎం అయ్యాక పొదుపు రుణాలన్నీ కూడా నేరుగా అక్కచెల్లెమ్మల చేతికే ఇస్తారని చెప్పండి.
– అన్న సీఎం అయ్యాక మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారని చెప్పండి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకే సాధ్యమని చెప్పండి. 
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ఇస్తారని చెప్పండి.
– గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న వద్దకు వెళ్లండి. చంద్రబాబు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. మోసం చేశారు. గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. గిట్టుబాటు ధరలు రావడం లేదని చెప్పండి. రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ఏడాదికి రూ.12500 ఇస్తారని చెప్పండి. అన్నా రైతన్న మోసపోవద్దు అని చెప్పండి. గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తారని గట్టిగా చెప్పండి. 
– ప్రతి అవ్వ, తాతవద్దకు వెళ్లి..ఇవాళ ఎన్నికలు వచ్చాయి. రెండు నెలల క్రితం పింఛన్‌ ఎంత ఇచ్చేవారు అని అడగండి. ఆ అవ్వ పింఛన్‌ ఇవ్వడం లేదని కానీ, వెయ్యి ఇచ్చే వారు అని చెబుతారు. జగనన్న రూ.2 వేలు ఇస్తామని చెప్పి ఉండకపోతే చంద్రబాబు ఇచ్చేవారా? అవ్వా 20 రోజులు ఓపిక పట్టండి ..మీ మనువడు ముఖ్యమంత్రి అవుతారు..పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతారని చెప్పండి. నవరత్నాలతో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూస్తానని నమ్ముతున్నాను.
– వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నావాజ్‌ నిలబడ్డారు. ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి నిలబడ్డారు. ఈ ఇద్దరికి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వాలని పేరు పేరున కోరుతున్నాను. మన పార్టీ గుర్తు తెలియని వారికి చెప్పండి. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌..అక్కా మన గుర్తు ఫ్యాన్‌..అవ్వా ఫ్యాన్‌..ఫ్యాన్‌ అన్నా..ఫ్యాన్‌ అక్కా..ఫ్యాన్‌ అవ్వా..ఫ్యాన్‌ అన్నా..ఫ్యాన్‌ అమ్మా..మన గుర్తు ఫ్యాన్‌..అక్కా ఫ్యాన్‌..తల్లి ఫ్యాన్‌ గుర్తు మనది..మరిచిపోవద్దు.

 

Back to Top