ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి

తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

 

తాడేపల్లి: ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. వెలుగుల పండగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి. దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

Read Also: వైయస్‌ భారతితో మహేష్ బాబు  సతీమణి నమ్రత భేటీ 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top