అమరావతి: స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధును ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ''స్విస్ ఓపెన్ గెలిచిన పీవీ సింధుకు కంగ్రాట్స్. మన జాతి గర్వించేలా చేశావు. ఈ సందర్భంగా ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరిన తెలుగు తేజం.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21–16, 21–8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్‌లో రెండో సింగల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.